దగ్గుబాటి అభిరామ్ కొందరితో మాంచి మూడ్‌లో ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలు ఓ రేంజ్‌లో ఉన్నాయట


Loading...

శ్రీరెడ్డి లీకులను మొదటి నుంచీ పరిశీలించేవారికి ఓ పెద్ద డౌటనుమానం… ఇంకా నా దగ్గర చాలా మంది పెద్దల బాగోతాల ఫోటోలు, వీడియోలు ఉన్నయ్, అందరినీ బజారుకీడుస్తాన్, అందరి జాతకాలూ బయటపెడతాన్ అంటున్నది కదా… పెద్ద పెద్ద సెలబ్రిటీలు తమ సరసకార్యాలను ఫోటోలు తీయటానికి, వీడియోలు తీయటానికి అంగీకరిస్తారా..? రహస్యంగా ఎవరైనా తీస్తారేమోననే సందేహాలతో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కదా..? ఇలాంటి ఫోటో ఆధారాలు రానురాను లేనిపోని చిక్కులకు దారితీస్తాయనే సోయి ఉంటుంది కదా..? మరి అలాంటప్పుడు అంతమంది ఫోటోలు, వీడియోలు ఎలా సాధ్యమయ్యాయి..? మిగతావాళ్ల గురించి చెప్పటానికి ఫోన్ చాటింగ్ స్క్రీన్ షాట్లను లీక్ చేసిన శ్రీరెడ్డి దగ్గుబాటి అభిరామ్ విషయంలో మాత్రం ఫోటోలు చూపించింది…
Loading...

తను అంత అజాగ్రత్తగా ఎలా దొరికిపోయాడు..? ఇదీ ఓ ప్రశ్న… నిన్న హైదరాబాద్ పోలీసుల దగ్గరకు వచ్చిన ఓ కేసు ఇంట్రస్టింగు… ఆ కేసు ఏమిటయ్యా అంటే..? శ్రీరెడ్డితో ఉన్న అభిరామ్ ఫోటో చూసిన ఓ నలుగురికి ఓ ఐడియా వచ్చింది… తనకు ఎవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నా, ఆ సాన్నిహిత్యాన్ని రికార్డు చేసుకోవడం, దాచుకోవడం, తరచూ చూసుకోవడం కొందరికి అలవాటు… ఓరకమైన పర్వర్షన్ అది… దగ్గుబాటికి కూడా ఈ అలవాటు ఉందనీ, లిప్ లాక్ సెల్ఫీ ఫోటో ఆ కారణంగానే శ్రీరెడ్డి దగ్గర ఉండిపోయిందనీ అంచనా వేశారు ఆ నలుగురు… అసలు ఆ అభిరామ్ ఫోనే చోరీ చేస్తే, అందులో ఏమేం ఉన్నాయో సంగ్రహించి, బ్లాక్ ‘మెయిల్’ చేస్తే కోట్లకుకోట్లు రాలతాయి కదా అని ప్లానేశారు… ఆ ప్లాన్ ప్రకారమే తనపై నిఘా వేశారు… ఓ రెస్టారెంటుకు అభిరామ్ వచ్చినప్పుడు, చాకచక్యంగా తన ఐఫోన్ తస్కరించారు… మరి దానికి ఓ పాస్‌వర్డ్ ఉంటుంది కదా… దాన్నీ క్రాక్ చేశారు… (నిజానికి ఇదీ తెలివి…) అందులో అభిరామ్ కొందరితో మాంచి మూడ్‌లో ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలు కనిపించాయి… ఇంకేముంది..? బంగారు కోడిపెట్ట ట్రాపులో పడ్డట్టే అనుకుని, ఎగిరి గంతేసిన వాళ్లు ఫలానా ఫలానా వీడియోలు, ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, కోటిన్నర ఇవ్వు చాలు, సర్దుకుంటాం, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టేస్తాం అని ఓ మెయిల్ పెట్టారు… ఇప్పటికే శ్రీరెడ్డి ఇష్యూలో బదనాం అయిపోయారు కదా… సురేష్‌బాబుకు కోపమొచ్చింది…
Loading...

నేరుగా పోలీస్ కమిషనర్‌ను కలిశాడు… మొరపెట్టుకున్నాడు… వెంటనే సైబర్ క్రైం రంగంలోకి దిగింది… ఈ బ్లాక్ మెయిల్ కోసం క్రియేట్ చేసిన మెయిల్ ఐడీ, ఇతరత్రా సాంకేతిక అంశాలతో దర్యాప్తు స్టార్ట్ చేశారు… తీగ లాగితే కథంతా బయటకొచ్చింది… నలుగురిని అరెస్టు చేశారు… అందులో ఇద్దరు నిరుద్యోగులు కాగా, ఒకతను కూరగాయలు అమ్ముకునేవాడు, మరొకతను చిన్న ఉద్యోగి… దగ్గుబాటి ఫోటోలు, వీడియోలు ఓ రేంజ్‌లో ఉన్నాయట… ఈ అభిరామ్ ఇంకా రాను రాను ఏం పెంట వ్యవహారాల్లో ఇరుక్కుంటాడో, ఇంకా ఏం తలనొప్పులు తెచ్చిపెడతాడో అని సురేష్‌బాబు తలపట్టుకున్నాడుట..! మొత్తానికి ఏం వారసుడు దొరికాడు ఆ ఫ్యామిలీకి..!!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)