అక్రమ సంబంధం మోజులో పడి బరి తెగించిన తల్లి తమ సుఖానికి అడ్డుగా ఉందని ఐదేళ్ల కన్నకూతుర్ని


Loading...

అనంతపురం జిల్లాలో కన్నతల్లే రాక్షసిగా మారింది. ప్రియుడి మోజులో పడి... కడుపున పుట్టిన బిడ్డనే హింసించింది. కదిరి మండలం కుమ్మరవండ్లపల్లిలో ఈ దారుణం జరిగింది. కుమ్మరవండ్లపల్లికి చెందిన లక్ష్మికి ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన హన్మంతుతో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఐదేళ్ల కుమార్తె ఉంది. లక్ష్మి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో... భర్త ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో మరింత బరి తెగించిన లక్ష్మి... ప్రియుడితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో తమ సుఖానికి కుమార్తె అడ్డుగా మారిందన్న కోపంతో...
Loading...

చిన్నారిపై కక్ష పెంచుకుంది. కడుపున పుట్టిన బిడ్డన్న ప్రేమ కూడా లేకండా... ఒళ్లంతా వాతలు పెట్టింది. చిన్నారి కాళ్లు, చేతులు పనిచేయకుండా మెలి తిప్పి రాక్షసిలా ప్రవర్తించింది. ఆ తర్వాత లక్ష్మి ప్రియుడితో కలిసి పారిపోయింది. తల్లి పెట్టిన టార్చర్‌కు ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. మంచం మీద నుంచి లేవలేని స్థితికి చేరుకోవడంతో.. బాలికను నాయనమ్మ ఆస్పత్రికి తరలించింది. వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రియుడి మోజులో పడి పేగుబంధాన్ని సైతం తెంచుకున్న లక్ష్మిపై స్థానికులు మండిపడుతున్నారు. ఆమెపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)