(వీడియో) న‌న్ను కూర‌గాయ‌ల్ని అమ్మిన‌ట్లు అమ్మేశారు.. మా పిన్ని న‌న్ను ఓ బ్రోక‌ర్ కి అమ్మేసింది


Loading...

హైదరాబాద్‌: కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి దాకా దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్క రాష్ట్రం కూడా దీనికి మిన‌హాయింపు కాదు. మైన‌ర్ బాలిక‌లు, ఒంటరి మ‌హిళ‌ల‌ను టార్గెట్‌గా చేసుకుని చెల‌రేగిపోతున్నాయి అసాంఘిక శ‌క్తులు. ఏటా దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఓ ఆడపిల్ల కిడ్నాప్ అవుతోంద‌ని హోమ్‌శాఖ చెబుతోంది. మ‌రి- వారంతా ఏమ‌వుతున్నారు? గాల్లో క‌లిసిపోవ‌ట్లేదే. ఏ సాలీడు గూటిలో చిక్కుకుంటున్నారు? వారికి ఏం జరుగుతోంది? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానమే ‘అమోలి`.అమోలీ అంటే వెలకట్టలేనిది’ అని అర్థం.
Loading...

నిజ‌మే ఆడ‌పిల్ల‌ను ఏ మాత్రం వెల‌క‌ట్ట‌లేం. అమోలి టైటిల్‌తో ఓ షార్ట్‌ఫిల్మ్ రెడీ అయ్యింది. తెలుగు, త‌మిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాష‌ల్లో దీన్ని చిత్రీక‌రించారు. తెలుగులో నాని, త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్ హిందీలో రాజ్‌కుమార్ రావు, ఇంగ్లీష్‌లో విద్యాబాల‌న్ దీనికి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. 28 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్‌ఫిల్మ్‌ను యూట్యూబ్‌లో విడుద‌ల చేశారు. దేశ‌వ్యాప్తంగా చోటు చేసుకున్న వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా, వాస్త‌వ బాధితుల‌తోనే దీన్ని చిత్రీక‌రించారు. త‌మ పిల్ల‌లు క‌నిపించ‌కుండా పోయిన‌ప్పుడు త‌ల్లిదండ్రులు ప‌డిన ఆవేద‌న‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపారు. వ్య‌భిచార రొంపిలో దిగిన బాధితుల ఆవేద‌న‌ను గుండెకు హ‌త్తుకునేలా ఉంటుంది.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)