ఓ మ‌హిళ‌తో క‌లిసి ఉన్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైరల్‌.. రెండువారాల త‌రువాత‌


Loading...

జైపూర్‌: ఓ మ‌హిళ‌తో సెక్స్ వీడియోలో క‌నిపించిన యువ‌కుడు అదృశ్యం అయ్యాడు. స‌రిగ్గా ప‌ది రోజుల త‌రువాత అత‌ని మృత‌దేహం ల‌భించింది. అదే గ్రామానికి చెందిన యువ‌కుడొక‌డు అత‌ణ్ని నిర్దాక్షిణ్యంగా హ‌త్య చేశాడు. మృత‌దేహాన్ని పాతిపెట్టాడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌ అల్వార్ జిల్లా గోవింద్‌గ‌ఢ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అలీస‌ర్ గ్రామంలో చోటు చేసుకుంది. హ‌తుడి పేరు రాజేంద్ర శ‌ర్మ‌. ప‌దిరోజుల కింద‌ట అత‌ను అదృశ్యం అయ్యాడు. అంత‌కుముందు నాలుగు రోజుల కింద‌ట రాజేంద్ర శ‌ర్మ ఓ మ‌హిళ‌తో క‌లిసి ఉన్న సెక్స్ టేప్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Loading...

గోవింద్‌గ‌ఢ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఆ వీడియో వాట్స‌ప్ ద్వారా హ‌ల్‌చ‌ల్ చేసింది. ఆ వీడియో వెలుగులోకి వ‌చ్చిన త‌రువాత రాజేంద్ర‌శ‌ర్మకు బెదిరింపులు మొద‌ల‌య్యాయి. ప‌దిరోజుల కింద‌ట అత‌ను ఎవ‌రికీ క‌నిపించ‌కుండా పోయాడు. రాజేంద్ర‌శ‌ర్మ కోసం అత‌ని కుటుంబీకులు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. అస‌లు విష‌యం బ‌హిర్గ‌త‌మైంది. రాజేంద్ర శ‌ర్మ క‌నిపించ‌కుండా పోయిన రోజు రాత్రి అత‌ను సీతారామ్‌తో కనిపించిన‌ట్లు ప్ర‌త్య‌క్ష‌సాక్షులు పోలీసుల‌కు వెల్ల‌డించారు.
Loading...

దీనితో వారు అత‌ణ్ని అరెస్టు చేశారు. సెక్స్ వీడియోలో రాజేంద్ర శ‌ర్మ‌తో క‌నిపించిన మ‌హిళ‌కు సీతారామ్ బావ అవుతాడు. ఆ ఆగ్ర‌హంతోనే తాను రాజేంద్ర శ‌ర్మ‌ను హ‌త్య చేసిన‌ట్టు సీతారామ్ అంగీక‌రించిన‌ట్లు గోవింద్‌గ‌ఢ్ పోలీస్‌స్టేష‌న్ ఎస్ఐ పురుషోత్త‌మ్ దాస్ తెలిపారు. మందు పార్టీ ఇస్తాన‌ని రాజేంద్ర‌శ‌ర్మ‌ను పిలిపించి తాగించాడ‌ని, మ‌త్తులో జారుకున్న అత‌ణ్ని త‌ల ప‌గుల‌గొట్టి హ‌త్య చేశాడ‌ని అన్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)