బాత్ రూమ్ లో దాక్కున్న 13 ఏళ్ళ సవతి కూతురిని లాక్కొచ్చి మరీ అత్యాచారం


Loading...

మహిళలు, యువతులతో పాటు మైనర్ బాలికలపై లైంగిక దాడులు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రతి రోజూ ఈ తరహ ఘటనలు చోటు చేసుకోకుండా పాలకులు కఠినంగా వ్యవహరిస్తున్నామని చెబుతున్నా దేశంలో ఏదో ఒక చోట ఈ తరహా ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. హైద్రాబాద్‌లో మైనర్ బాలికపై సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది అయితే ఈ విషయమై రాజీ కుదుర్చుకొనేందుకు ప్రయత్నాలు చేశాడు.ఎట్టకేలకు ఈ విషయం తెలిసిన భార్య భర్తపై ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైద్రాబాద్ లో 13 ఏళ్ళ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. తొలుత మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్టు భార్యను నమ్మించి క్షమాపణలు కోరిన భర్త, ఆ తర్వాత కూడ సవతి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను విడిచిపెట్టాలని ఆ బాలిక ఎంతగా అరిచినా కానీ ఆ నిందితుడు మాత్రం ఆ బాలికను మాత్రం వదల్లేదు. తన పశువాంఛను తీర్చుకొన్నాడు. అంతేకాదు పోలీసు కేసు పెట్టకుండా ఉండాలని నిందితుడు రాజీ కోసం ప్రయత్నాలు చేశాడు. అయితే ఎట్టకేలకు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. హైద్రాబాద్‌లో నివాసం ఉండే ఓ వివాహితకు భర్త చనిపోయాడు. భర్త చనిపోయేనాటికి ఆమెకు కూతురు ఉంది. ఆ కూతురు వయస్సు ప్రస్తుతం 13 ఏళ్ళు. అయితే 8 ఏళ్ళ క్రితం ఆ వివాహిత మరో వ్యక్తిని వివాహం చేసుకొంది.
Loading...

ప్రస్తుతం అతడితో కలిసి ఆమె నివసిస్తోంది. వివాహిత కూతురు కూడ వారితో పాటే ఉంటుంది. అయితే భార్య పనికి వెళ్ళిన సమయంలో ఇంటికి వచ్చిన సవతి తండ్రి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత తల్లి పనికి వెళ్ళే సమయంలో భయంతో కూతురు అసలు విషయాన్ని చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఈ విషయమై భర్తను నిలదీసింది భార్య. అయితే ఈ విషయమై తాను తప్పు చేశానని భర్త భార్యను కోరాడు. మద్యం మత్తులోనే ఈ దారుణానికి పాల్పడినట్టుగా ఆయన చెప్పారు. భవిష్యత్తులో మరో తప్పు చేయబోనని ఆమెకు తేల్చి చెప్పాడు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత భార్య పనికి వెళ్ళింది. అయితే అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. భయంతో కూతురు బాత్‌రూమ్‌లోకి వెళ్ళి తలుపులు వేసుకొంది. బాత్‌రూమ్ తలుపులు పగులగొట్టి మైనర్ బాలికపై సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు బెల్ట్‌తో కొట్టి తీవ్రంగా హింసించాడు.
Loading...

ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత భార్య పనికి వెళ్ళింది. అయితే అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. భయంతో కూతురు బాత్‌రూమ్‌లోకి వెళ్ళి తలుపులు వేసుకొంది. బాత్‌రూమ్ తలుపులు పగులగొట్టి మైనర్ బాలికపై సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.అంతేకాదు బెల్ట్‌తో కొట్టి తీవ్రంగా హింసించాడు. పని నుండి ఇంటికి వచ్చిన తల్లికి కూతురు అసలు విషయాన్ని తేల్చి చెప్పింది. కూతురిని తీసుకొని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసు నమోదు చేయాలని కోరుతూ బాధితురాలు తల్లితో కలిసి మూడు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించింది.పోలీసులు కూడ ఈ కేసు విషయమై అంతగా శ్రద్ద చూపలేదు. ఈ ఘటన తర్వాత నిందితుడు పారిపోయాడు. అంతేకాదు బాధితురాలి చదువు సహయం చేస్తానని, బ్యాంకులో డబ్బులను డిపాజిట్ చేయిస్తామని రాజీ కోసం ప్రయత్నాలను ప్రారంభించాడు. అయితే తాను ఆ ఇంటికి వెళ్ళనని బాధితురాలు చెప్పారు. హస్టల్‌లో ఉంటూ తాను విద్యాభ్యాసం చేస్తానని ఆమె చెప్పారు. న్యాయం చేయలని బాధితురాలు కోరారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)