ఏ భార్య చేయని దుర్మార్గపు పని ఆమె చేసింది. పెళ్లయిన 10 రోజులకే పక్కా ప్లాన్ వేసి భర్తను మర్డర్ చేయించింది


Loading...

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. నాకు నువ్వు, నీకు నేను.. అని ఒకరికొకరు బాసలు చేస్తారు. జీవితాంతం నీకు తోడుగా ఉంటానని భర్త భార్యకు.. భార్య భర్తకు వాగ్దానం చేస్తారు. కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా అండగా ఉంటామని దేవుడి ముందు ప్రమాణం చేస్తారు. ఆ జంట కూడా అలాగే చేసింది. బంధువుల సమక్షంలో వేడుకగా పెళ్లి జరిగింది. కానీ పెళ్లయిన 10 రోజులకే దారుణం జరిగిపోయింది. ఏ భార్య చేయని దుర్మార్గపు పని ఆమె చేసింది. పెళ్లయిన 10 రోజులకే పక్కా ప్లాన్ వేసి భర్తను మర్డర్ చేయించింది.

విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించిన నవవరుడి హత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ ఉద్యానవనం సమీపంలో నవదంపతులపై దాడి ఘటన ఊహించని మలుపు తిరిగింది. నగలు, నగదు కోసం దోపిడీ దొంగలు దాడి చేసి చంపారని ముందుగా అనుకున్నా… హత్య వెనుక భార్య హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. ఇది దాడి కాదు కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని తెలుసుకుని పోలీసులే షాక్ అయ్యారు. ప్రియుడి సాయంతో పక్కాగా ప్లాన్ చేసి భర్తను భార్యే హత్య చేయించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇష్టంలేని పెళ్లి చేయడంతో స్నేహితుడితో కలిసి భార్యే భర్తను హతమార్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Loading...

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టపులివలస గ్రామానికి చెందిన యామక శంకరరావు ఇంజినీరింగ్‌ పూర్తిచేసి కర్ణాటకలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏప్రిల్‌ 28న ఇదే మండలం కడకెల్ల గ్రామానికి చెందిన సరస్వతితో వివాహమైంది. సోమవారం దంపతులు ఇద్దరూ ద్విచక్రవాహనం బాగు చేయించేందుకు విజయనగరం జిల్లా పార్వతీపురం వచ్చారు. పనిలో పనిగా బంగారు దుకాణంలో నగలకు సంబంధించిన లావాదేవీలు చూసుకొని రాత్రి ఎనిమిది గంట‌ల త‌ర్వాత స్వస్థలం చిట్టపులివలసకు బయల్దేరారు. మార్గ‌మ‌ధ్యంలో ఐటీడీఏ పార్కు దాటిన త‌ర్వాత‌ వెనుక నుంచి వచ్చిన ఆగంతకులు శంకరరావుపై దాడి చేశారు. త‌ల‌పై ఇనుపకడ్డీతో బలంగా కొట్ట‌డంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం సరస్వతిని బెదిరించి బంగారు ఆభరణాలు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనను సవాల్‌ గా తీసుకున్న పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్య సరస్వతిని అనేక కోణాల్లో విచారించగా అసలు విషయం బ‌య‌ట ప‌డింది. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపంతో స్నేహితుడు శివతో కలిసి భర్తను హత్య చేయించినట్లు సరస్వతి అంగీకరించింది. స్నేహితుడు శివ రౌడీషీటర్‌ గోపీ ముఠాతో కలిసి శంకరరావు హత్యకు పథకం పన్నాడని తెలిపింది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Loading...

కాగా తమ పై దాడికి సంబంధించి సరస్వతి చెబుతున్న కథనాలకు పొంతన లేకపోవడం… మరోవైపు నిందితులు దొరకడంతో కేసులో చిక్కుముడి వీడినట్టయింది. సరస్వతి శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోవడం, శంకరరావు జేబులో డబ్బు ఉన్నా దాన్ని టచ్ చేయకపోవడం వంటి అంశాలు పోలీసుల్లో అనుమానాలు పెంచాయి. ప్రస్తుతం పోలీసులు సరస్వతి కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఆమె నుంచి ఎవరెవరికి ఫోన్లు వెళ్లాయి, ఎప్పుడు వెళ్లాయన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరస్వతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన నిందితులు, సరస్వతిని వేర్వేరుగా విచారించి ఆధారాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి చిక్కుముడి వీడినట్టేనని, శంకరరావు హత్య కేసులో సరస్వతి ప్రమేయం ఉందని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, శ్రీకాకుళం జిల్లా చిట్టిపూడివలసకు చెందిన గౌరీశంకరరావుకు, సరస్వతికి పది రోజుల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన 10 రోజులకే భర్తను ఇంత దారుణంగా చంపించిన వైనం అందరిని ఉలిక్కి పడేలా చేసింది. ఇక శంకరరావు తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు అండగా ఉంటాడని అనుకున్న కొడుకు.. ఇక లేడు అని తెలిసి బోరున విలపిస్తున్నారు. నా కొడుకు ఏం తప్పు చేశాడు? అని అతడి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. ఇంతటి దారుణానికి తెగబడిన సరస్వతిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)