మహేశ్ బాబుకి మరో అరుదైన గౌరవం.. మ్యూజియంలో మాహేశ్ మైనపు విగ్రహం

లండ‌న్‌లోని మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియం.. భార‌త్‌లోనూ అడుగుపెట్టింది. సినిమాతో పాటు ప‌లు రంగాల‌కి చెందిన సెల‌బ్రిటీల మైన‌పు బొమ్మ‌ల‌ని ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవ‌ల ఆశాభోంస్లే, మ‌ధుబాల‌, క‌ట్ట‌ప్ప త‌దిత‌ర సెల‌బ్రిటీల మైన‌పు విగ్ర‌హాలు ఏర్పాటు చేశారు. బాహుబ‌లి చిత్రంతో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌భాస్ బొమ్మ‌ని బ్యాంకాక్‌లోని మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
భ‌ర‌త్‌ అనే నేను సినిమాతో భారీ హిట్ కొట్టిన మ‌హేష్ మైన‌పు విగ్ర‌హం కూడా ఇప్పుడు టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీర‌నుంది. ఈ విష‌యాన్ని మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఏర్పాటు చేస్తున్నారని.. తన వివరాలు సేకరించేందుకు వచ్చిన ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ అరుదైన ఘ‌న‌త‌ని ప్ర‌భాస్ మాత్ర‌మే ద‌క్కించుకోగా, ఇప్పుడు మ‌హేష్ కూడా ఆ లిస్ట్‌లో చేరారు. మహేశ్ మైనపు బొమ్మను ఢిల్లీలో పెడతారా.. లేక బ్యాంకాక్‌లో పెడతారా? అన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)