వాళ్ళు మన సైనికులను చంపుతుంటే మనం వాళ్ళతో క్రికెట్ ఆడాలా ? పాకిస్తాన్ పై గౌతం గంభీర్ ఫైర్

పాకిస్థాన్‌పై టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్ మరోమారు విరుచుకుపడ్డాడు. పాక్‌తో అసలు ఏ రంగంలోనూ సంబంధాలు వద్దని తెగేసి చెప్పాడు. సరిహద్దుల్లో వారు మన సైనికులను పొట్టనపెట్టుకుంటూ ఉంటే శాంతి చర్చల పేరుతో వారికి దగ్గర కావాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నాడు. అసలు పాకిస్థానీయులను భారత్‌లో కాలుపెట్టకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. క్రికెట్, సినిమాలు, సంగీతం.. ఇలా ఏ రంగంలోనూ వారితో సంబంధాలు వద్దని పేర్కొన్నాడు. పాకిస్థాన్‌కు బుద్ధి వచ్చే వరకు వారిని భారత్‌లో అడుగుపెట్టనివ్వకపోవడమే మంచిదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందన్న గంభీర్.. సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నాడు. ఈ విషయంలో రాజకీయాలకు ఆస్కారం ఇవ్వరాదన్నాడు. గతేడాది సుక్మాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన భారత సైనికుల కుటుంబాలకు అండగా నిలిచిన గంభీర్ వారి పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందిస్తున్నాడు. ఈ సందర్భంగా గురువారం రాత్రి వారిని కలిసిన గంభీర్ అందరితో కలిసి భోజనం చేశాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)