(వీడియో) 'ఎంత ధైర్యం రా నీకు.. ఏం చేస్తావ్.. రేప్ చేస్తావా ' ఫుల్లుగా మందు కొట్టి నడిరోడ్డుపై యువతి వీరంగం

హైదరాబాద్ సిటీ బేగంపేట అనగానే ఠక్కున గుర్తొస్తుంది ట్రాఫిక్. 24 గంటలూ వాహనాల రద్దీ ఉంటుంది. అలాంటి ఏరియాలో.. మెయిన్ రోడ్డుపై ఓ యువతి కారుతో బీభత్సం చేయటమే కాకుండా.. అడ్డుకుని ప్రశ్నించిన వాహనదారులపై వీరంగం వేసింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ట్రాఫిక్ రద్దీగా ఉన్న ఈ రోడ్డుపై ఇష్టమొచ్చినట్లు డ్రైవింగ్ చేసింది. అటూ ఇటూ తిప్పుతూ ర్యాష్ డ్రైవింగ్ చేసింది. కారు ర్యాష్ డ్రైవింగ్ చూసి అప్పటికే చాలా మంది వాహనదారులు తృటిలో తప్పించుకున్నారు. ఓ వ్యక్తి స్కూటీని ఢీకొట్టింది. అయినా ఆగకుండా వెళ్లిపోయింది. కారు బీభత్సం చూసి బెంబేలెత్తిన వాహనదారులు కొందరు.. వేగంగా వెళ్లి కారును ఆపారు. అప్పటికిగానీ కారు నడుపుతున్నది యువతి అని వారికి అర్థం కాలేదు.

కారులో నుంచి మొదట దిగటానికి నిరాకరించిన యువతి.. అందరూ నిలదీయడంతో బయటకు వచ్చి శివాలెత్తింది. కారుకు అడ్డంగా టూవీలర్ పెట్టిన వ్యక్తిపై చేయి చేసుకుంది. హౌ డేర్ యూ అంటూ మీద మీదకు వచ్చింది. ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అందర్నీ హడలెత్తించింది. అప్పటి వరకు ప్రశ్నించిన గొంతులు అన్నీ కూడా యువతి హల్ చల్ తో హడలిపోయారు. ఈ హంగామాను చూసిన ట్రాఫిక్ పోలీసు వచ్చి.. యువతికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంది. AP 10BF 1000 నెంబర్ గల ఓక్స్ వ్యాగన్ కారులో ఉన్నయువతి మద్యం తీసుకుని ఉందని కారుని ఆపిన వాహనదారులు చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ సర్దిచెప్పటంతో అక్కడి నుంచి సైనిక్ పురి వైపు వేగంగా వెళ్లినట్లు చెబుతున్నారు. యువతిపై కంప్లయింట్ వస్తే చర్యలు తీసుకుంటాం అని చెబుతున్నారు పోలీసులు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)