స్నానం చేసే ముందు ఇలా చేస్తే చాలు పొట్ట దానంతటదే తగ్గుతుంది.. ఇది రాజుల కాలం నుండి వాడుతున్న అత్యంత విశిష్టమైన పద్ధతి

మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతితో ఎక్కువ మందిని ఇప్పుడు బరువు సమస్య వేధిస్తోంది. పొట్ట పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయి. బరువు పెరగటంతోనే ఇతర సమస్యలు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ప్రారంభమవుతాయి. పనిలో పనిగా షుగర్, గుండె జబ్బులు వెంటాడుతున్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకొని ఆరోగ్యంగా ఉండాలంటే బరువును తగ్గించుకోవటం ఉత్తమమైన మార్గం. ఈ క్రమంలో బరువును తగ్గించుకొనేందుకు అనేక రకాల పద్దతులున్నా ఇప్పుడు చెప్పబోయేది ఆరోగ్యంగా బరువు తగ్గించుకొనే విధానం. ప్రతి రోజు ఉదయాన్నే స్నానం చేయటానికి ముందు నువ్వుల నూనెతో పొట్టపై మర్దన చేస్తే చాలు. క్రమంగా బరువు తగ్గిపోతారు. నువ్వుల నూనెను ఇలా ఉపయోగిస్తే బరువు దానంతటదే తగ్గటం ప్రారంభమవుతుంది. ఇది రాజుల కాలం నుండి వాడుతున్న అత్యంత విశిష్టమైన పద్ధతి.
నువ్వుల నూనెను ఎలా వాడాలి…
1. ఉదయం లేవగానే ముందు రెండు గ్లాసుల గోరు వెచ్చని నీళ్లు తాగాలి.
2. స్నానానికి వెళ్లే ముందు పొట్టపై నువ్వుల నూనెతో 15 నిమిషాలపాటు మర్దన చేయాలి. దీంతో జీర్ణాశయం పనితీరుమెరగై కొవ్వు కరగటం ప్రారంభమవుతుంది.
3. నువ్వుల నూనెలో ఒమెగా-3,6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని త‌గ్గిస్తాయి. శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ నిల్వ‌ల‌ను త‌గ్గిస్తాయి.
4. పైన చెప్పిన విధంగా నువ్వుల నూనెను శ‌రీరంపై కొవ్వు ఉన్న ప్రాంతాల్లో రాస్తే అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది.
5. నిత్యం స్నానం చేసే ముందు చిన్న పిల్ల‌ల‌కు నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేస్తే వారి శ‌రీరం బాగా ఎదుగుతుంది. మెద‌డు ప‌దునుగా మారుతుంది. చిన్నారుల్లో ఉండే కొవ్వు క‌రిగిపోతుంది. ఈ నూనెలో ఉండే పోష‌కాల‌న్నీ పిల్ల‌ల‌కు ల‌భిస్తాయి.
6. కాప‌ర్‌, ఇత‌ర ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు నువ్వుల నూనెలో ఉంటాయి. దీంతో ఇవి కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. కొద్దిగా నువ్వుల నూనెను తీసుకుని కొంచెం వేడి చేసి మోకాళ్ల‌పై రాసుకుంటే నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి.
7. నువ్వుల నూనెలో ఉండే పోష‌కాలు ఎముక‌ల‌కు దృఢ‌త్వాన్ని ఇస్తాయి. ర‌క్త‌నాళాల‌ను శుభ్రం చేస్తాయి. శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి.
8. మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు నిత్యం 2 టేబుల్ స్పూన్ల మోతాదులో నువ్వుల నూనెను ఏవిధంగానైనా తీసుకుంటే వారి శ‌రీరంలోని ర‌క్తంలో ఉండే చ‌క్కెర స్థాయిలు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. దీని వ‌ల్ల షుగ‌ర్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.
9. నువ్వుల నూనెలో విట‌మిన్ ఇ, బిలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డ‌మే కాదు, అన్ని ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి. నువ్వుల నూనెను త‌ర‌చూ వాడ‌డం వ‌ల్ల ముఖం కాంతివంత‌మ‌వుతుంది. చ‌ర్మం మృదువుగా మారుతుంది.
10. నువ్వుల నూనెతో త‌ల‌కు మ‌ర్ద‌నా చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. చుండ్రు స‌మ‌స్య పోతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)