రుజిత దివేకర్.. దేశంలో చాలా పాపులర్ డైటీషియన్.. అంబానీ కొడుకు 108 కిలోల బరువు తగ్గించిన ఈమె చెబుతున్న మంచి పాయింట్స్ ఇవే.. చాలా బాగున్నాయి

Loading...
బీపీ, సుగర్, అల్సర్, ఊబకాయం, నీరసం, స్ట్రెస్… ఏం తినాలి..? ఏం వదిలేయాలి..? అందరిలోనూ ఇదే టెన్షన్ రోజూ…! ఏం తాగాలన్నా ఓ సందిగ్ధం… ఏం తినాలన్నా ఓ సందేహం… అన్నింటికీ లెక్కలు… ప్రమాద హెచ్చరికలు, ఆంక్షలు, పరిమితులు…. రుజిత దివేకర్ అని ఓ న్యూట్రషనిస్టు ఉంది… దేశంలో చాలా పాపులర్, హైలీ పెయిడ్ డైటీషియన్… దేశంకెల్లా అత్యంత ధనికుడు ముఖేష్ అంబానీ కొడుకు జూనియర్ అంబానీ 108 కిలోల బరువు తగ్గించటానికి తోడ్పడిన వ్యక్తి… మరి ఆమె ఏమంటున్నది..? అందరికీ వర్తించే కొన్ని మంచి పాయింట్లు చెబుతున్నది…

1. మీకు స్థానికంగా దొరికే పండ్లను తినండి… అరటిపళ్ళు , ద్రాక్ష, సపోటా, మామిడి, ఏదైనా సరే ! పళ్ళు అన్నిటిలోనూ ఫ్రక్టోజు ఉంటుంది. మామిడి తినడం ఆపిల్ తినడం కంటే హానికరం కాదు. ఎందుకూ అంటే మామిడి మీకు లోకల్, ఆపిల్ మీకు లోకల్ కాదు, ( ఆపిల్ కాశ్మీరు నుండి వస్తుంది, మామిడి మీకు లోకల్ గా దొరుకుతుంది) ఫ్రక్టోజు మీ గ్లూకోజును నియంత్రణలో ఉంచుతుంది కనుక మీరు పళ్ళను నిరభ్యంతరంగా తినచ్చు.

2 . మీరు గింజలనుండి వచ్చిన నూనెలను వాడండి…. ( వేరుశనగ నూనె, నువ్వులనూనె, కొబ్బరినూనె, ఆవనూనె ) పేకింగ్ లో వచ్చే vegetable నూనేలకన్నా ( ఆలివ్, రైస్ బ్రాన్ , refined ఆయిల్స్ ) మీరు ఆడించుకున్న ఆయిల్స్ మంచివి.

3. ప్రతిరోజూ నెయ్యి తినండి. ఏ ఆహారపదార్ధం లో నెయ్యి ఎక్కువగా తినవచ్చో, దానిలో ఎక్కువగానూ, దేనిలో తక్కువ తినాలో దానిలో తక్కువగానూ తినాలి. నెయ్యి వాడడం వలన కొలెస్టరాల్ తగ్గుతుంది .

4. మీ ఆహారం లో కొబ్బరి ఎక్కువగా వాడండి. అటుకుల పులిహార ( పోహా ) లో ఇడ్లీ, దోశల చట్నీ, అన్నం లో చట్నీ గా తినాలి. కొబ్బరిలో కొలెస్టరాల్ అస్సలు ఉండదు. మీ నడుము సన్నబడేలా చేస్తుంది కొబ్బరి.

5. మీరు ఓట్స్ గానీ, ధాన్యాలు గానీ టిఫిన్ గా తినవద్దు… అవి పేకేజ్డ్ ఆహారం. అవి మనకు అవసరం లేదు. వాటికి రుచీ పచీ ఉండదు, బోరు కొడుతూ ఉంటాయి, మనకు ముఖ్యంగా ఆహారం బోరు కొట్టకూడదు.

6. బిస్కట్ యాడ్ లో కొరికిన ప్రతి ముక్కలోనూ పీచు ఉంది అంటారు .. పీచుకోసం ఓట్స్ తినక్కరలేదు. ఓట్స్ బదులు పోహా, ఉప్మా, ఇడ్లీ, దోశ తినొచ్చు.

7. మీ నోట్లో పళ్ళు ఉన్నంత కాలం జ్యూసులు త్రాగకండి . మీకు పళ్ళు ఉన్నది కూరలూ పళ్ళూ నమిలి తినడానికే !

8. చెరుకు రసం మిమ్మల్ని డీ టాక్సిఫై చేస్తుంది. అది ఫ్రెష్ జ్యూస్ రూపంలో తాగినా చెరుకు ముక్కలు తిన్నా సరే !

9. PCOS , థైరాయిడ్  – బరువు తగ్గేవీ వ్యాయామాలు చెయ్యండి. పేకేజీ ఆహారం వదిలిపెట్టండి.

10. RICE – మామూలు తెల్లని అన్నం తినండి. బ్రౌన్ రైస్ అయినా పర్వాలేదు. రైస్ యొక్క GI INDEX (తిన్న వెంటనే దేహంలో పెరిగే గ్లూకోజ్) చాలా తక్కువ . అది పప్పు , పులుసు , పెరుగు వంటి వాటితో కలిస్తే దాని GI index మరింత తగ్గుతుంది. వీటికి తోడు నెయ్యిని కూడా చేరిస్తే అది మరింత తగ్గుతుంది . రైస్ లో మినరల్స్ ఉన్నాయి. కాబట్టి మీరు రోజుకు మూడుసార్లు కూడా తినవచ్చు .

11. ఎంత తినాలి ? ఆకలి తీరేవరకు ఎంతైనా తినండి. మీ పొట్ట ఏమి చెప్తుందో దాన్ని బట్టి చెయ్యండి.

12. మీరు రైస్, చపాతీ రెండూ తినవచ్చు, లేదా ఒక్క రైస్ మాత్రమే తినవచ్చు. మూడు పూటలా మీ ఇష్టం వచ్చినట్టు ఏమీ భయపడకుండా తినండి. మీ ఆకలిని బట్టి తినండి.

13. మీరు తినే ఆహారం మిమ్మల్ని భయపెట్టకూడదు. ( నెయ్యి , రైస్ తినకూడదు అంటూ భయం వద్దు ) మీరు తినే ఆహారం మిమ్మల్ని మంచిగా ఫీల్ అయ్యేలా ఉండాలి.

14. అయ్య బాబోయ్ ఎన్ని కేలరీలు తిన్నానో అని భయపడకండి , ఎంత పోషకాహారం తీసుకున్నానో అనేది చూడండి. NEVER look at CALORIES. Look at NUTRIENTS.

15. పిజ్జా, పాస్తా, బ్రెడ్, బిస్కట్, కేకులు అస్సలు తినవద్దు. No bread, biscuits, cakes, pizza, pasta

16. మిమ్మల్ని మీరు ప్రశ్నిచుకోండి. ఈ ఫుడ్ మా అమ్మమ్మ తినేదా ? మీ జవాబు ఎస్ అయితే భయం లేకుండా తినండి . Ask yourself, is this the food my Nani & Dadi ate? If yes then eat without fear.

17. రుతువును బట్టి తినండి. వర్షాకాలం లో పకోడీలు, జిలేబీలు లాంటివి తినండి. ఎందుకంటే ఆకలి రుతువును బట్టి ఉంటుంది. ఒక్కొక్క సీజన లో వేపుళ్ళు తినాలి. తినండి Eat as per your season. Eat pakoda, fafda, jalebi in monsoon. Your hunger is as per season. Few seasons we need fried food, so eat them.
18. ఉదయాన్నే టీ మీ మొదటి ఆహారంగా తీసుకోకండి. అలాగే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా టీ త్రాగకండి. రోజులో రెండు మూడు సార్లు పంచదార వేసుకుని టీ త్రాగండి. ( When not to have chai – tea – don’t drink tea as the first thing in morning or when you are hungry. Rest you can have it 2-3 times a day and with sugar. )

19. గ్రీన్ టీ త్రాగకండి. ఎల్లో టీ, గులాబీ టీ, నీలం టీ ఏమీ వద్దు . NO GREEN tea please. No green, yellow, purple, blue tea.

20. మీ సాంప్రదాయ ఆహారం తీసుకోండి ( Eat ALL of your TRADITIONAL foods. )

21. నిలవచేసిన పేకేజీ ఫుడ్ / డ్రింక్స్ ఏమీ వద్దు ( Strictly NO to packaged foods / drinks.) 

22. వ్యాయామం చెయ్యండి. వాకింగ్ చెయ్యండి. అరగడానికీ , ఆరోగ్యంగా ఉండడానికీ. ( Exercise / Walk to digest & stay healthy.)
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...