భార్య చదువుకోవాలన్నకోరికని తెలుసుకున్న భర్త ఎంతో కష్టపడి చదివించాడు. తీరా చదువు ముగిశాక కష్టపడి చదివించిన భర్తకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది

ఒకప్పుడంటే ఆడపిల్లలు చదువుకోవడానికి చాలా హద్దులుండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి. కానీ చాలా చోట్ల ఆడపిల్లలకు కూడా విద్యను అందిస్తున్నారు. కొంత మంది అమ్మాయిలు చాలా ఇష్టపడి బలవంతంగా అయినా తల్లిదండ్రులను ఒప్పించి చదువుకుంటున్నారు కానీ పెళ్లీడు రాగానే పెళ్లి చేయాలనే ఆలోచనే తల్లిదండ్రులది. తన భార్య చదువుకోవాలన్నకోరికని తెలుసుకున్న భర్త.. ఎంతో కష్టపడి చదివించాడు. తీరా చదువు ముగిశాక కష్టపడి చదివించిన భర్తకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఆమె. ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది అతడి భార్య.

తమిళనాడులోని తిరునల్వేలి సమీపంలోని కట్టలై వీధికి చెందిన వ్యక్తి కుమార్‌. వ్యవసాయం చేసుకుంటూ బతికే కుమార్ కి ఏడేళ్ల క్రితం కేరళ ఎర్నాకులం కు చెందిన ధనలక్ష్మితో పెళ్లి అయింది. అయితే.. తన భార్యకు చదువుకోవాలన్న కోరికని కుమార్‌ తెలుసుకున్నాడు. దీనితో.తనకెలాగు చదువులేదూ, చదువుకోవాలనుకుంటున్న తన భార్య కోరిక అయినా తీరుద్దామనుకున్నాడు కుమార్.. తనకున్న 5ఎకరాల పొలాన్ని, నగలను, అమ్మి సేలంలోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చేర్పించాడు. నాలుగేండ్ల పాటు కుమార్ కష్టపడుతూ, ధనలక్ష్మిని మహారాణిలా చూసుకున్నాడు. ఇంజినీరింగ్‌ ముగిశాక ధనలక్ష్మి ఎంటెక్‌ చదవడానికి ఆసక్తి చూపింది.

అయితే.. తనకు అంత స్తోమత లేదని కుమార్ చెప్పడంతో.. కుమార్ తో మాట మాత్రం అయినా చెప్పకుండా తన సర్టిఫికెట్లను తీసుకుని ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. చదువుకోవడానికే వెళ్లిందనే భ్రమలో ఉన్నాడు భర్త. కానీ అసలు నిజం వేరే అది కూడా ధనలక్ష్మి బంధువు ద్వారా కుమార్ కి తెలిసింది.. విషయం ఏంటంటే.. కుమార్‌ చనిపోయినట్లు చెప్పి ధనలక్ష్మి రెండో పెళ్లి చేసుకుందని, ధనలక్ష్మి బందువు చెప్పడంతో కుమార్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీనితో చేసేదేంలేక పోలీసులకు ఫిర్యాదు చేసాడు కుమార్. పోలీసుల విచారణలో తన భార్య కుమార్‌ చనిపోయినట్లు చెప్పి రాజపాళయంకు చెందిన ఇంజినీరును పెళ్లి చేసుకున్నట్లు వెల్లడైంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)