వరుసకు చెల్లినే మోసం చేశాడు.. బాత్‌రూమ్‌లో ఉండగా రహస్యంగా వీడియో..

సోదరీసోదరుల బంధానికి మాయనిమచ్చ.. వరుసకు చెల్లినే మోసం చేశాడు.. బాత్‌రూమ్‌లో ఉండగా రహస్యంగా వీడియో.. ప్రేమించాలని... పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. అశ్లీల ఫొటోలు, వీడియో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరింపు.. రూ. 8 లక్షల డిమాండ్‌..

అతడు ఆమెకు వరుసకు సోదరుడు. ఆ మహిళ బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తోంది. బంధువులు కదాని అతడి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేది. చాలాసార్లు వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేసింది. అతడు కుటిలబుద్ధి ప్రదర్శించాడు. ఆమె మంచితనాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నీచంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి మాయని మచ్చ తెచ్చాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె సైబరాబాద్‌ షీటీమ్‌ను ఆశ్రయించింది. నిందితుడి ఆటకట్టించి కటకటాల వెనక్కి నెట్టారు.

దుండిగల్‌ మండలం, గండిమైసమ్మ ప్రాంతానికి చెందిన ఓ మహిళ బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తోంది. వరుసకు సోదరుడి కుటుంబాన్ని సొంత వాళ్లలా భావించింది. ఏ కష్టం వచ్చినా ఆర్థికంగా వారిని ఆదుకునేది. ఆమెకు ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడింది. ఏడేళ్ల పాటు వారిని ఆర్థికంగా ఎన్నోసార్లు ఆదుకుంది. సోదరుడు మాత్రం ఆమెపట్ల నీచంగా ప్రవర్తించాడు. ఆమె మంచితన్నాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న అతడు తనను ప్రేమించాలని పట్టుబట్టాడు. అతడి మాటలు విన్న మహిళ హతాశురాలైంది. ఇంగిత జ్ఞానం లేకుండా వరుసకు చెల్లెలినే ప్రేమించమని వేధిస్తావా..! అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. అప్పటి నుంచి అతడిని దూరంగా పెట్టింది. ఈ విషయం ఇరుకుటుంబాలకు తెలిస్తే పరువుపోతుందని మిన్నకుండిపోయింది. అతడు వేధింపులు ఆపకపోగా మరింత ఎక్కువయ్యాయి.

ఆ మహిళ అతడికి వార్నింగ్‌ ఇచ్చి దూరంగా పెట్టింది. అప్పటి నుంచి ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆమె బాత్‌రూమ్‌లో ఉండగా రహస్యంగా వీడియో తీశాడు. నేను చెప్పినట్టు వినాలని, నన్ను పెళ్లి చేసుకోకపోతే వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. వీడియో, అశ్లీల చిత్రాలు సోషల్‌ మీడియలో అప్‌లోడ్‌ చేయకుండా ఉండటానికి రూ. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేకపోతే సమాజంలో తలెత్తుకోలేకుండా చేస్తానని బెదిరించాడు. ఇలా కొంతకాలంగా ఆమెను మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నాడు. గత నెల 2వ తేదీన కొంతమంది వ్యక్తులను తీసుకొని ఆమె ఇంటికి వెళ్లి దాడి చేశాడు. బలవంతంగా పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగువారు వచ్చి అడ్డుకున్నారు. అతడి ఆగడాలు, వేధింపులు భరించలేని బాధితురాలు షీటీమ్‌ను ఆశ్రయించగా నిందితుడిని అరెస్టు చేశారు.

రోజు రోజుకు ఆమెకు అతడి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆమె పనిచేస్తున్న బ్యాంకు వద్దకు ప్రతిరోజూ వెళ్లి వేధించేవాడు. ఆ మహిళ ఎన్నిసార్లు వార్నింగ్‌ ఇచ్చినా అతడిలో మార్పురాకపోగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. యాసిడ్‌ బాటిల్‌ తీసుకొని వెళ్లి నన్ను ప్రేమించకపోతే నీ ముఖం మీద పోస్తానని బెదిరించాడు. మరోసారి వెళ్లి నీ వల్లే నేను చనిపోయానని సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. కొంతకాలంగా ఆమెను మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)