భర్త కళ్లముందే భార్యను, అన్న కళ్ల ముందే చెల్లెలిని, ప్రియుడి ముందే ప్రియురాలిని గ్యాంగ్‌ రేప్ చేసి..

వాళ్లు నరరూప రాక్షసులు. వాళ్ల అరాచకాలు, దారుణాలు దండుపాళ్యం సినిమాను మించిపోయాయి. ఇది మోస్ట్ డేంజరస్ రేపిస్ట్ గ్యాంగ్. ఈ ముఠా పేరు వింటేనే ఒంగోలు మహిళలు భయంతో వణికిపోతారు. ప్రేమ జంటలు, దంపతులే ఈ గ్యాంగ్ టార్గెట్. అటాక్ చేస్తారు. దోచుకుంటారు. ఆ తర్వాత రేప్ చేసి చంపడానికి వెనుకాడరు. సాగర్ కాలువలో గుర్తు తెలియని శవాల వెనుక ఈ ముఠా హస్తం ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరి ఈ నరరూప రాక్షసులు ఇంకా ఎలాంటి నేరాలు చేశారు?

సేమ్ టు సేమ్ దండుపాళ్యం సినిమా స్టైల్లో నేరాలు చేస్తారు. మహిళ మానప్రాణాలతో ఆడుకునే నీచాతి నీచులు. వీళ్లను తిట్టడానికి, వీళ్ల రాక్షస క్రీడను వర్ణించడానికి పదాలను వెతుక్కోవాలి. పది మంది కలిసి రోజుకు ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. బైకులపై బయలుదేరుతారు. నిర్మానుష్య ప్రాంతంలో మాటు వేస్తారు. భార్యాభర్తలు, ప్రేమ జంటలు, అన్నా చెల్లెళ్లు... కలిసి వెళ్తుంటే ఫాలో అవుతారు. మాటలతో వేధిస్తారు. అదను చూసి అటాక్ చేస్తారు. భర్త కళ్లముందే భార్యను, అన్న కళ్ల ముందే చెల్లెలిని, ప్రియుడి ముందే ప్రియురాలిని గ్యాంగ్‌ రేప్ చేసి వాళ్ల జీవితాలను నాశనం చేస్తారు. అడ్డుకోబోయే మగవారిపై దౌర్జన్యం చేస్తారు. ఇష్టం వచ్చినట్లు కొట్టి వాళ్ల దగ్గరున్న బంగారం, నగదును లాక్కుని జంప్ అవుతారు.

రెండేళ్లుగా ఈ ముఠా ప్రకాశం జిల్లాలో అరాచకాలు సాగిస్తున్నా పోలీసులు కనిపెట్టలేకపోయారు. పట్టుకోలేకపోయారు. చివరికి ఒక దొంగ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు... 10 మందిలో 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తే కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి. ఈ ముఠా 30కిపైగా రేప్‌లు, దోపిడీలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. చీమకుర్తి, సంతనూతలపాడు, తాళ్లూరు ప్రాంతాలకు చెందిన సంచార జాతివాళ్లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ నరహంతక ముఠాకు నాయకుడు చదవుసంద్యలేని పాలపర్తి ఏసు. రెండేళ్ల క్రితం వరకు కుందేళ్లు, అడవి పందుకు పట్టుకుంటూ జీవనం సాగించే ఏసు కన్ను సాగర్ కాలువపై ఏకాంతంగా గడిపేందుకు వచ్చే జంటలపై పడింది. దీంతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని దారుణాలు మొదలు పెట్టాడు. ఒంగోలు మండలంలోని కొణిజేడు, చెరువుకొమ్ముపాలెం, వెంగముక్కలపాలెం, కొప్పోలు బైపాస్‌ రోడ్డు ప్రాంతం, అలాగే మద్దిపాడు మండలం మల్లవరం డ్యాం దగ్గర, చీమకుర్తి, రామతీర్ధం ప్రాంతాల్లో వీరు బైక్‌లపై వెళ్ళే జంటలపై దాడి చేసి అత్యాచారాలకు, దోపిడీలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ నీచులు పిల్లలు, వృద్ధులను కూడా వదిలిపెట్టలేదు. మదమెక్కిన ఈ మానవ మృగాలు కసిదీరా కాటేసి వాళ్ల జీవితాలను సర్వ నాశనం చేశారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. ఈ ముఠా దాడిలో యువతులు చనిపోయినా అత్యాచారం చేయకుండా వదిలిపెట్టరు. పరువు పోతుందనే భయంతో కొందరు, ప్రాణ భయంతో మరికొందరు పోలీసులకు కంప్లైంట్ చేయడానికి ముందుకురాలేదు. ఇక సాగర్‌ కాలువలో గుర్తు తెలియని మృతదేహాల వెనుక కూడా ఈ ముఠా పాత్ర ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఇప్పటిదాకా 8 మందిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ నరహంతక ముఠా సాగించిన దారుణ ఆకృత్యాలను కనిపెట్టడంలో పోలీసు నిఘా విఫలమైనట్లు ఆరోపణలున్నాయి. గత అక్టోబర్ 22న ఆరుగురు సభ్యుల ముఠా తమపై దాడిచేసి సెల్‌ఫోన్ లాక్కెళ్లినట్లు ఓ యువతి కంప్లైంట్ చేసినా పోలీసులు లైట్ తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా కొన్ని కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ ముఠా రెండేళ్లుగా అరాచకాలు సాగించినట్లు ఆరోపణలున్నాయి. చివరికి ఒక దొంగ ఇచ్చిన సమాచారంతో తీగలాగితే డొంక కదిలింది. ఈ ముఠా నుంచి రెండు లక్షల విలువైన సెల్‌ఫోన్లు, బంగారు నగలు, నాలుగు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)