అబ్బా ఏమి అందం 18ఏళ్ల అమ్మాయిలా ఉన్నావ్ నువ్వు గుర్తొచ్చి రాత్రి నిద్ర కూడా పట్టలేదు

అబ్బా ఏమి అందం.. 18ఏళ్ల అమ్మాయిలా ఉన్నావ్.. ఆ ఎస్సై దొంగలను పట్టుకుంటాడో లేదో కాని, నచ్చిన ఆడవాళ్లను వలేసి పట్టుకోవడంలో మాత్రం చాలా సిద్ధహస్తుడి మల్లే ఉన్నాడు. ‘కలలో నువ్వే, కళ్లల్లో నువ్వే కనిపిస్తున్నావ్.. నువ్వు గుర్తొచ్చి రాత్రి నిద్ర కూడా పట్టలేదు.. తెలుసా’ ఛీ.. ఆ ఎస్ఐ మాట్లాడిన మాటల్లో కాస్త సభ్యతతో కూడిన మాటలేమున్నాయంటే ఇవే.. ఓ మహిళా సర్పంచిని ప్రలోభ పెడుతూ బహిరంగంగా, నిస్సిగ్గుగా ఫోన్ లో ఆమెను లోబర్చుకునేందుకు యత్నించి అడ్డంగా బుక్కయిపోయాడు. నెల్లూరు జిల్లా సైదాపురం ఎస్సై ఏడుకొండలు ఫోన్ సంభాషణల భాగోతం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఊటుకూరు గ్రామ సర్పంచితో నిస్సిగ్గుగా ఫోన్ లో సరసాలాడిన రికార్డింగ్ నెల్లూరు ఎస్సీకి చేరింది.

ఓ భూవివాదంలో చిక్కుకొన్న మహిళా సర్పంచ్‌ నిస్సహాయతని వాడుకొన్నాడు. కేసు నెపంలో ఇంటికి వెళ్లేవాడు. ‘న్యాయం చేయిస్తా’నని లొంగదీసుకోబోయాడు. ఫోన్‌ చేసి, పదేపదే ఒత్తిడి తెచ్చాడు. ఇక తట్టుకోలేని స్థితిలో, ఆమె నెల్లూరు జిల్లా ఎస్పీని కలిసింది. ఆ వెంటనే సైదాపురం ఎస్సై ఏడుకొండలు యూనిఫాం ఊడిపోయింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం, సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో 1.50 ఎకరాల భూమిని మానికి చెందిన మోడుబోయిన సుబ్బారావు.. తన భార్య అరుణ పేరుతో సర్పంచ్‌ మంచు పద్మజ వద్ద కొన్నాడు. ఈ లావాదేవీ 2000లో జరిగింది. తాము విక్రయించింది 1.20 ఎకరాల భూమేనని, మిగిలిన 30 సెంట్లు తమ స్వాధీనంలోనే ఉందని పద్మజ కుటుంబం ఎదురుతిరిగింది. దీనిపై రెండేళ్ల క్రితం అరుణ కుటుంబం సైదాపురం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఏడుకొండలు ఎస్‌ఐగా ఉన్నాడు. ఆ ఎస్సై ఏం మాట్లాడో మీరూ చూడండి.. వినండి..

ఆయన పట్టించుకోకపోవడంతో వారు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలతో ఎస్‌ఐ సర్పంచ్‌ పద్మజ, ఆమె కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లు, జయరామయ్య, దినేశ్‌, శేషాద్రి, శ్రీనివాసులుపై కేసులు పెట్టాడు. పద్మజకు మాత్రం స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి.. మిగతావారిని కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు పంపించాడు. ఈ క్రమంలో ఏడుకొండలు.. పద్మజకి దగ్గర కావడానికి ఎంతో ప్రయత్నించాడు. కేసు వంకలో ఆమె ఇంటికి వెళ్లి గంటలకు గంటలు గడిపేవాడు. ఫోన్‌చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. ఆ సమయంలో అతని వాయిస్‌రికార్డు చేసి.. ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకి ఆమె శుక్రవారం అందించింది. ఏడుకొండలుపై మహిళా సర్పంచి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవముందని తేలడంతో సస్పెండ్‌ చేశారు.

ఏ కేసు విచారణైనా ఏడుకొండలు కన్నుసన్నల్లోనే సాగాలి. సైదాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఆయన మాటే వేదం. కాదంటే బాధితులకే కాదు, తోటి పోలీసులకూ చుక్కలు చూపిస్తాడు. ఓ కానిస్టేబుల్‌ ఆయన అక్రమాలను ప్రశ్నించాడు. అతడిపై ఏడుకొండలు కక్షకట్టి, వేధించాడు. తన పై అధికారులకు లేనిపోనివి చెప్పి.. ఆ కానిస్టేబుల్‌ని వీఆర్‌కు పంపించాడు. మహిళా సర్పంచిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక ఎస్సైపై ఎట్టకేలకు వేటు పడడం పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ డీఐజీ కేవీవీ గోపాల్‌ రావు శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఫోన్ సంభాషణల ఆడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)