అమ్మాయి అందంగా కనబడితే చాలు ప్రార్థనల పేరుతో వారిని లొంగదీసుకోవడం, బాడీ మసాజ్‌లు, ఇంకా ఇంకా ఇంకా

భక్తి ముసుగులో అమాయక మహిళల జీవితాలను నాశనం చేసిన మరో పాస్టర్ బండారం బయటపడింది. ప్రార్థనల పేరుతో అమ్మాయిలతో అతడు చేసే కామ క్రీడలు, రాసలీలలు, అత్యాచారాల బాగోతం బట్టబయలైంది. భక్తి పేరుతో, ప్రభువు నామంతో లెక్కలేనన్ని దురాఘతాలకు పాల్పడిన ఆ పాస్టర్ అరాచకాలు విస్తుగొలుపుతున్నాయి.

ప్రార్థనల పేరుతో అమ్మాయిలను సెక్స్ బానిసలుగా చేసుకున్న పాస్టర్ పాపం పండింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన పాస్టర్ ఎబెనెజర్ పాపాల చిట్టా బయటపడింది. సేవ పేరుతో అమాయక యువతులను ఇంట్లోనే ఉంచుకోవడం, ఆపై అత్యాచారం చేయడం.. ఇదీ ఈ దైవ సేవకుడి నిజస్వరూపం. పాస్టర్ దురాఘతాలు బయటపెట్టింది మరెవరో కాదు.. స్వయాన అతడి భార్య. అమ్మాయిలతో ఆర్థరాత్రి నగ్నంగా ప్రార్థనలు చేయించినట్లు పాస్టర్ భార్య చెప్పడం గమనార్హం. యువతులకు ఎబెనెజర్ ఏదో ఇస్తాడని, అందుకే అతడిని వదిలి రావడానికి ఇష్టపడరని భార్య ఆరోపిస్తోంది. అతడి దురాఘతాలను ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలకు గురిచేశాడని వాపోయింది. పాస్టర్ ఎబెనెజర్ అనేక మంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడని, వారిని తల్లిదండ్రులకు దూరం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రార్థనల కోసం చర్చికి వచ్చే వారిపై మత్తుమందు చల్లి వారిని లోబర్చుకునేవాడని తెలిసింది. ప్రభువు కరుణించాలంటే, ప్రభువు ప్రత్యక్షం కావాలంటే నగ్నంగా ప్రార్థనలు చేయాలని మాయమాటలు చెప్పేవాడని గ్రామస్తులు చెబుతున్నారు.

ప్రభువు పేరు చెప్పి అమ్మాయిలను లొంగదీసుకోవడం పాస్టర్ ఎబెనెజర్ హాబీ అని, అమ్మాయిలతో బాడీ మసాజ్‌లు చేయించుకుంటాడని బాధితులు చెబుతున్నారు. తనతో శృంగారంలో పాల్గొంటే సమస్యలు తీరిపోతాయని, తాను చెప్పినట్లు చేస్తే స్వస్థత కలుగుతుందని మాయ మాటలు చెప్పి యువతను లొంగదీసుకున్నాడని తెలిసింది. తాను దేవుడితో మాట్లాడతానని చెప్పి వారికి సెక్స్ పాఠాలు నేర్పుతాడు. ఇలా సుమారు 20 మంది అమ్మాయిల్ని తన బానిసలుగా చేసుకున్నాడు ఆ కామాంధుడు. అమ్మాయి అందంగా కనబడితే చాలు కుటుంబ ప్రార్థనల పేరుతో వారిని రప్పించుకుంటాడు. ఆ తర్వాత వారిని తన బానిసలుగా మార్చుకుంటాడు. అశ్లీల పుస్తకాలు, కండోమ్ పాకెట్లు ఆయన గదిలో కుప్పలుగా దొరికాయి. పాస్టర్ దగ్గర ఉన్న తమ పిల్లల ఆచూకీ తెలియడం లేదని కొందరు తల్లిదండ్రులు వాపోయారు. పాస్టర్ ఎబెనెజర్ దురాఘతాలపై ఏపీ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తీవ్రంగా స్పందించారు. చర్చి పాస్టర్ గా పనిచేస్తూ, దైవ బోధకుడి ముసుగులో పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేస్తూ, లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న ఎబెనెజర్ పై చర్యలకు ఆమె ఆదేశించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)