నిజం తెలిసిన తర్వాత ఆ తల్లి తండ్రి " అమ్మ నాకొడకా ఎంత పని చేసావ్ రా " అంటూ.. తాట తీస్తారేమో

ఒక రోజు ఒక కొడుకు త‌న త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు వ‌చ్చి ఇలా అన్నాడు.
కొడుకు: మ‌మ్మీ, డాడీ.. నేను మీకు ఓ విష‌యం చెప్పాలి.
త‌ల్లి: ఏదైనా సీరియ‌స్ మ్యాట‌రా ?
తండ్రి: డ‌బ్బు ఏమైనా కావాలా ?
కొడుకు: లేదు డాడీ. నాకు డ‌బ్బు ఏమీ అవ‌స‌రం లేదు. కానీ నా గురించిన ఓ ముఖ్య‌మైన విష‌యం మీకు చెప్పాల‌ని అనుకుంటున్నా.
ఆ మాట చెప్పిన కొడుకు త‌ల‌దించుకుంటాడు. దాంతో ఆ కొడుకు త‌ల్లికి ఓ విష‌యం చూచాయ‌గా అర్థ‌మ‌వుతుంది. అప్పుడు ఆమె..

త‌ల్లి: నాకు తెలుసు. నువ్వు ల‌వ్‌లో ప‌డ్డావు క‌దా. ఎప్పుడు కాల్ చేసినా నీ ఫోన్ బిజీగా వ‌స్తుంది. అందుకే నువ్వు ల‌వ్‌లో ప‌డి ఉంటావ‌ని అప్పుడే నేన‌నుకున్నా. ఎవ‌రామె ? ఏదైనా ఆఫీస్‌లో ప‌నిచేస్తుందా ? లేక మీ కాలేజ్ అమ్మాయా ? చెప్పు. నీ లైఫ్‌ను నేను బ్ర‌హ్మాండంగా ప్లాన్ చేశా. నా ప్రార్థ‌న‌ల‌న్నింటినీ దేవుడు ఆల‌కించ‌లేదు. అస‌లు దేవుడే లేడు.
కొడుకు: లేద‌మ్మా. అది కాదు. అస‌లు నాలో ఎలాంటి సెక్స్ ఫీలింగ్స్ లేవు. నాకు అమ్మాయిలంటే ఏమాత్రం ఆక‌ర్ష‌ణ క‌ల‌గ‌డం లేదు. నేను మీకు చెప్పాల‌నుకున్న‌ది ఇదే. న‌న్ను క్ష‌మించండి.
త‌ల్లి: కానీ… అస‌లు ఇదెలా సాధ్యం ?
తండ్రి: ఇప్పుడేం చేద్దాం ?
కొడుకు: ఏం అవ‌స‌రం లేదు. నేను మీకు చెప్పాల‌నుకున్న విష‌యం చెప్పా. ఇక దీనిపై అంత‌గా ఆలోచించ‌కండి. నాకు పెళ్లి కూతుర్ని చూడ‌కండి. నా జీవితం న‌న్ను ఒంట‌రిగా బ‌త‌క‌నివ్వండి.
తల్లి (ఏడుస్తూ): నేను చూసిన పూజ‌లు, నోచిన నోములు, వ్ర‌తాలు అన్నీ వృథా అయ్యాయే. దేవుడు లేడు. నా మొర ఆల‌కించ‌డం లేదు.

30 నిమిషాల త‌రువాత…
త‌ల్లి కొడుకు గ‌దికి వ‌స్తుంది.
త‌ల్లి: దీనికి ప‌రిష్కారం ఏమీ లేదా ? దీన్ని న‌యం చేయ‌లేమా ?
కొడుకు: లేద‌మ్మా. ఇది వ్యాధి కాదు. దీన్ని న‌యం చేయ‌లేము.
త‌ల్లి: క‌నీసం ఎవరో ఒక అమ్మాయి కూడా నీకు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌డం లేదా ? మీ కాలేజీలో, బ‌య‌ట ఎక్క‌డా ఏ అమ్మాయి అయినా ఇష్టం క‌ల‌గ‌డం లేదా ?
కొడుకు: అమ్మా.. ప్లీజ్‌.. నాకు తెలీదు.
త‌ల్లి: ఆలోచించు.. నీకు ఇష్ట‌మైన అమ్మాయితోనే నేను మాట్లాడుతా.
కొడుకు: దాని గురించి ఇక వ‌దిలెయ్ అమ్మా. నాకోసం నువ్వు ఇంకొక‌రి జీవితంతో ఆడుకోవ‌ద్దు. నాకు ఎవ‌ర‌న్నా ఇంట్ర‌స్ట్ క‌ల‌గడం లేదు. క‌నుక ఈ విష‌యాన్ని వ‌దిలెయ్‌.

త‌ల్లి: ఎంత పని చేశావ్‌, దేవుడా.
త‌ల్లి కొడుకు గది నుంచి వెళ్లిపోతుంది.
కొడుకు పెద్ద పెట్టున న‌వ్వుతాడు. వాట్సాప్ ఓపెన్ చేస్తాడు.
కొడుకు: చూడు.. మ‌నం వ‌చ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాం. మన మిష‌న్ స‌క్సెస్ అయింది. నాకు అమ్మాయిలంటే ఇంట్ర‌స్ట్ క‌ల‌గ‌డం లేద‌ని చెప్పా. నా త‌ల్లిదండ్రులు క‌నీసం ఎవ‌రో ఒక అమ్మాయిని అయినా ఇష్ట‌ప‌డు ఆమెతో మాట్లాడుతాం అని చెప్పారు. మ‌న ప్లాన్ వ‌ర్క‌వుట్ అయింది. ఓకే.
గ‌ర్ల్‌ఫ్రెండ్‌: ఇడియ‌ట్‌.. పేరెంట్స్‌ను అలా మోసం చేయ‌వ‌చ్చా. క‌నీసం పెళ్ల‌య్యాక అయినా వారికి నిజం చెప్పు.

నీతి – త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు మంచి లైఫ్‌ను ఇవ్వాల‌ని కోరుకుంటారు. కానీ దాన్ని వారిపై బ‌ల‌వంతంగా రుద్ద‌కూడ‌దు. పిల్లల అభిప్రాయాల‌ను కూడా కొన్నిసార్లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. అలా తీసుకోలేని పేరెంట్స్ ఉంటే వారి పిల్ల‌లు ఇలాంటి మాస్ట‌ర్ ప్లాన్లే వేస్తారు..!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)