నెలలపాటు తన భుజాలపై భర్తను మోసింది. కంటికి రెప్పలా అతడిని కాపాడుకొంది.

Loading...
విధి అతడి జీవితాన్ని కబళించింది. అయితే భర్తలో సగం అయిన భార్య అతడికి అండగా నిలిచింది. నెలలపాటు తన భుజాలపై భర్తను మోసింది. కంటికి రెప్పలా అతడిని కాపాడుకొంది. భర్తపై ఆమె చూపిస్తున్న ప్రేమను చూసి ఆ దేవుడికి కూడా ముచ్చటేసి ఆమెకు సాయం అందేలా చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర కు చెందిన విమల, బదన్‌ సింగ్‌ లు భార్యా భర్తలు. బదన్ సింగ్ ట్రక్కు డ్రైవర్‌ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే 2017 లో బదన్ కు వ్యక్తికి నరాల వ్యాధి వచ్చింది. దీంతో అతని ఎడమకాలును తొలగించారు డాక్టర్లు. దీంతో అతని కుటుంబం అతలాకుతలం అయింది. అప్పటినుంచి అన్నీ తానై చూసుకొంటుంది విమల. 

ఒంటికాలుతో ఎక్కడికి వెళ్లాలన్న ఇబ్బంది ఏర్పడటంతో అతనికి చక్రాల కుర్చీ ఇవ్వమని ప్రభుత్వ హాస్పిటల్స్ చుట్టూ భర్తను భుజాలపై మోస్తూ తిరిగింది. వికలాంగుల సర్టిఫికేట్‌ లేదన్న కారణంతో అతడికి చక్రాల కుర్చీ లభించలేదు. ఎలాగైనా భర్తకు చకరాల కుర్చీ ఇప్పించాలన్న పట్టుదలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న ఆమెను చూసిన కొందరు ఆమె ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పెట్టారు. ఈ ఫొటోలు వైరల్‌ అవడంతో ఆ రాష్ట్ర మంత్రి భూపేంద్ర చౌదరి స్పందించారు. విమల కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భూపేంద్ర సాయంతో భర్తకు చక్రాల కుర్చీ ఇప్పించుకోగలిగింది. భర్తను చిన్నపిల్లాడిలా భుజాలపై మోస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆమెకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...