ఇక ఆడవాళ్లు పెళ్ళిళ్ళ ఫంక్షన్ లకు వెళ్ళాలంటే భయపడతారేమో.. ఏకంగా 40 వేల మంది మహిళల అశ్లీల ఫొటోలు

ఒక ఫొటోస్టూడియో వ్యక్తి నీచానికి దిగజారడంతో వివిధ వివాహాలకు హాజరైన మహిళలంతా లైంగిక వేధింపుల బాధితులుగా మారిన ఘటన కేరళలో బయటపడింది. వడకర పట్టణంలోని సదయమ్‌ స్టూడియోను సతీశన్, దినేశ్, బిటేశ్ నిర్వహిస్తున్నారు. ఆ పట్టణంలో వివిధ వివాహా శుభకార్యాల ఫోటోలను వీరు తీసేవారు. ఆ వివాహాలకు హాజరైన పలువురు మహిళల ఫోటోలను అందంగా చిత్రీకరించేవారు. వివాహానంతరం వారి ఫోటోలను వారికి అందజేసిన తరువాత వీరు ఆ ఫోటోలును నీచంగా మార్చేవారు.

పలువురు మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటిని ఆన్ లైన్ లో పెట్టేవారు. ఇలా తీసిన ఫోటోల్లో ఒక మహిళ తన ఫోటోను గుర్తుపట్టి పోలీసులకు ఫిర్యాదు చేయగా డొంక కదిలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సతీశన్‌, దినేశ్‌ లను అరెస్ట్‌ చేసి, పరారీలో ఉన్న బిబేశ్‌ కోసం గాలింపు చేపట్టారు. . వీరి ఫోటో స్టూడియోను సీజ్ చేశారు. వీరి స్టూడియో హార్డ్ డిస్క్ లో సుమారు 40 వేల మంది మహిళల ఫొటోలు ఉన్నాయని వారు తెలిపారు. నిందితులు నేరాన్ని అంగీకరించారని, పూర్తి విచారణ అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని పోలీసులు తెలిపారు.దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)