అల్లుడిని అత్త తియ్యగా పిలిచి ప్రేమ ఒలకబోసింది.. ఆమె తియ్యటి మాటలు నిజమేనని నమ్మిన అల్లుడు ఇంటికి వెళ్ళాడు..

లవ్ మ్యారేజ్ ఓ యువకుడిని బలితీసుకుంది. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ పెద్దలు పెళ్లికి నో అన్నారు. పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇక నో ప్రాబ్లం అనుకున్నారు. కలిసుందాంరా అంటూ అత్తమామలు ప్రేమగా పిలిచారు. ఆ యువకుడు కాదనలేకపోయాడు. అదే అతడికి చివరి రోజైంది. పరువు కోసం అత్తమామలు అతడిని అంతం చేశారు? మరి ప్రాణం తీస్తే పరువు నిలబడుతుందా ? అల్లుడి మర్డర్‌కు అత్తామామలు కలిసి స్కెచ్ వేశారు. అత్త లేనిప్రేమను ఒలకబోసింది. మామ అత్యంత దారుణంగా అల్లుడిని హత్య చేశాడు..... కూతురిని లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడనేది అత్తమామల కోపం. పరువు తీశాడని ఆగ్రహించిన అత్తమామలు అల్లుడిని ఇంటికి ప్రేమగా పిలిచారు. నిద్రపోతున్న అల్లుడి గొంతులో ఈటెతో పొడిచి ప్రాణం తీశాడు కసాయి మామ....

ఈ దారుణం అనంతపురం జిల్లా నల్లమాడ మండలం బడవాండ్లపల్లిలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన భార్గవి, ధనుంజయ్‌ లవ్‌లో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ పెద్దలు నో చెప్పారు. ఏడు నెలల క్రితం ఇద్దరూ ఊరు విడిచి పారిపోయారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. కూతురి లవ్‌ మ్యారేజ్ ఇష్టంలేని భార్గవి తల్లిదండ్రులు కోపంతో రగిలిపోయారు. వాళ్ల ఆచూకీ తెలుసుకున్నారు. తమ కుటుంబం పరువుతీసిన ధనుంజయ్‌ని ఖతం చేయాలని స్కెచ్ వేశారు. కానీ బయటికి మాత్రం ప్రేమగా నటించారు. జరిగిందేదో జరిగిపోయింది... కలిసుందాం రా అంటూ భార్గవి తల్లి కాటమ్మ... కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచింది. ఆమె తియ్యటి మాటలు నిజమేనని నమ్మిన భార్గవి, ధనుంజయ్‌లు పది రోజుల క్రితం సొంత ఊరికి తిరిగి వచ్చారు..

అత్తింట్లో ఉంటున్న ధనుంజయ్‌కి భార్గవి తండ్రి గిరిబాబు ప్రవర్తనపై అనుమానం వచ్చింది. భయపడి కదిరి మండలం కాళసముద్రంలోని అక్క దగ్గరికి వెళ్లిపోయాడు. కానీ తమ తల్లిదండ్రులు ఏమీ అనరు అంటూ భార్గవి ధనుంజయ్‌కి నచ్చజెప్పింది. రెండు రోజుల క్రితం మళ్లీ తన ఇంటికి తీసుకెళ్లింది. అవకాశం కోసం వేచిచూస్తున్న మామ గిరిబాబు... సోమవారం రాత్రి ఇంట్లో నిద్రపోతున్న ధనుంజయ్‌ని ఈటతో గొంతులో పొడిచి హత్య చేశాడు. అడ్డుకోబోయిన భార్గవి కూడా గాయపడింది. పరువు కోసం అల్లుడిని హత్యచేసిన గిరిబాబు... ఆ వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. అల్లుడిని హత్యచేసి పరారీలో ఉన్న గిరిబాబు కోసం గాలిస్తున్నారు. పెళ్లి చేసుకుని ఏడు నెలలు గడిచింది. ఇక అంతా మరిచిపోయివుంటారని పొరపాటు పడిన ధనుంజయ్ చివరికి ప్రాణం పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రుల కపట ప్రేమను కనిపెట్టలేకపోయిన భార్గవి... తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కోల్పోయింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)