కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు.. ఓ తల్లినీ, ఆమె కూతురినీ లోబర్చుకున్నాడు. తర్వాత ఆమె మనవరాలిపైనా కన్నేశాడు

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు.. ఆర్థిక దుస్థితిని ఆసరాగా చేసుకుని ఓ తల్లినీ, ఆమె కూతురినీ లోబర్చుకున్నాడు. తర్వాత ఆమె మనవరాలిపైనా కన్నేశాడు. అతడి వికృత చేష్టలు ఎక్కువవడంతో విషయం కాస్తా జిల్లా ఎస్పీ వరకు వెళ్లింది. వివరాలివీ.. పిడుగురాళ్లకు చెందిన నాగేశ్వరరావు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

కొన్నాళ్లకు ఆమె కూతురిని కూడా లోబర్చుకున్నాడు. తల్లీ కూతుళ్లతో సహజీవనం సాగిస్తూనే.. చివరికి కూతురి కుమార్తెపై(మనవరాలు)నా కన్నేశాడు. ఆమెకు వివాహమైనప్పటికీ మూడేళ్ల క్రితం భర్తతో విభేదాలు రావడంతో తన కుమార్తెను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. అయితే అక్కడ తల్లితోనూ, అమ్మమ్మతోనూ సహజీవనం చేస్తున్న నాగేశ్వరరావు.. తన కోరిక తీర్చాలంటూ ఆమెపై లైంగిక వేధింపులు ప్రారంభించాడు.

అతడికి బుద్ధి చెప్పాల్సిన తల్లి, అమ్మమ్మలు సైతం చివరికి అతడికే వత్తాసు పలికారు. ఈ క్రమంలో బాధితురాలు కొద్ది రోజుల క్రితం పిడుగురాళ్ల నుంచి పారిపోయి గుంటూరులో ఉన్న తన స్నేహితురాలి చెంతకు చేరింది. ఆమె సలహా మేరకు సోమవారం బాధితురాలు రూరల్‌ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పిడుగురాళ్ల సీఐను ఆదేశించారు.

Latest Posts