అచ్చంగా మన తెలుగు అమ్మాయి.. కర్ణాటక మినిస్టర్స్ కి దడ పుట్టిస్తుంది

రోహిణి సింధూరి గుర్తుందా..? మన తెలుగు మహిళే… హైదరాబాద్ యూనివర్శిటీలో చదువుకున్నది… 2009 బ్యాచ్ ఐఏఎస్… యూపీఎస్సీలో 43 ర్యాంకు క్రాక్ చేసింది… భర్త సుధీర్ రెడ్డి…! ఎందుకీ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా…? కర్నాటకలో అధికార పక్షానికి చుక్కలు చూపిస్తున్నది… అందుకే మరోసారి చెప్పుకోవడం ఇలా..! ఆమె హసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్… తాజాగా ఏం చేసిందంటే..? ఆ జిల్లా ఇన్‌చార్జ్ మినిష్టర్ ఉన్నాడు… పేరు ఎ.మంజు… ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక ప్రభుత్వ ఆఫీసులను వాడుకోవద్దు కదా… కానీ ఓ పీడబ్ల్యూడీ ఇన్‌స్పెక్షన్ బంగ్లా… గెస్ట్ హౌజు అనుకొండి… దాన్ని తన ఆఫీసుగా మార్చుకుని రహస్యంగా ఆపరేట్ చేస్తున్నాడు… ఆమెకు తెలిసింది… వెళ్లింది, చూసింది… సీజ్ చేసి పారేసింది… అందరికీ నోటీసులు ఇచ్చింది… ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వస్తే, ఫోఫోవోయ్ అని ఫోన్లు పెట్టేసింది… అదీ తాజా కథ… అసలు ఇంతకుముందే ఆమెకు అధికారపక్షానితో ఫైటింగు కదా, ఇక దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ఆమెపై కారాలు మిరియాలు నూరుతున్నది… మళ్లీ మా ప్రభుత్వం రానీ, నీ సంగతి చెబుతాం అని అల్టిమేటమ్స్ జారీ చేస్తున్నది…
సదరు మంత్రిగారు ఆ గెస్టు హౌజును దేనికి వాడుకుంటున్నాడో తెలుసా..? అచ్చంగా ఎన్నికల పనికే… ముందువైపు తాళాలు వేసి, ఎవరికీ అనుమానం రాకుండా లోపల రహస్యంగా ఆఫీసు నడిపిస్తున్నాడు… ఆమె వెళ్లింది… ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఇక అధికారగణమంతా ఎన్నికల సంఘం పరిధిలోకే వస్తారు కదా… నిర్మొహమాటంగా ఆ ఆఫీసు మూసేసింది…సదరు మంత్రి రేపు ఉదయంలోపు వివరణ ఇచ్చుకోవాలి… ఆ పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను కూడా బుక్ చేసింది… నిజానికి అధికారపక్షంతో ఢీ అనేది ఆమెకు కొత్త కాదు… గతంలో ఆమె పనితీరును బాగా మెచ్చుకున్న సిద్ధరామయ్యే ఆమెను జనవరిలో ట్రాన్స్‌ఫర్ చేశాడు… ఎందుకంటే..? ఈ సిన్సియర్ అధికారి అక్కడ ఉంటే తమ పప్పులు ఉడకవంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులు తనపై ఒత్తిళ్లు తెచ్చారు… దానికి మొన్న జరిగిన బాహుబలి మహామస్తకాభిషేకం ఏర్పాట్లను సాకుగా చూపించాడు…
ఈయనే సదరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి మంజు… మహామస్తకాభిషేకం కోసం వచ్చే సీఎంకు సరైన ఏర్పాట్లు చేయలేదనీ, మరికొన్ని సాకులను చూపుతూ సీఎంపై ఒత్తిడి తెచ్చాడు… షోకాజు నోటీసులు ఇప్పించాడు… చివరకు బదిలీ ఉత్తర్వులు ఆమెకు వచ్చాయి… దీంతో షాక్ తిన్న ఆమె హైకోర్టును, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది… మార్చి 5న కేంద్ర ఎన్నికల సంఘం కూడా మేం చెప్పేదాకా ఆమె జోలికి వెళ్లవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది… ఐఏఎస్ అధికారుల బదిలీలు మా ఇష్టం అని సిద్ధరామయ్య ఆఫీసు ఏదో చెప్పబోతే… అవన్నీ తరువాత, ముందు సీఏటీ ఏం చెబుతుందో చూసి, ఆలోచిద్దాంలే అని చెప్పింది… దాంతో ఆమెను కదల్చలేక, ఆమెపై కస్సుబుస్సుమంటున్నారు కాంగ్రెస్ నాయకులు… పనిలోపనిగా బీజేపీ, జేడీఎస్ నేతలు కూడా సిన్సియర్ ఆఫీసర్లను ఇలా సతాయించడం సిద్ధరామయ్యకు అలవాటే అంటూ విమర్శలకు దిగారు… ఆమె గురించి సంక్షిప్తంగా… ఏపీకి చెందిన మహిళ… 1984లో పుట్టింది… యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, కెమికల్ ఇంజనీరింగ్ చేసింది… యూపీఎస్సీలో 43వ ర్యాంకు… అదీ కథ… రేప్పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వస్తే ఏమిటి..? అనడిగితే ఓ చిరునవ్వే ఆమె నుంచి సమాధానం… దటీజ్ రోహిణి సింధూరి…!!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)