డబ్బులు ఉన్న వాళ్ళతో.. డబ్బులు లేని వాళ్ళతో.. ఆసుపత్రులలో ఎలా ప్రవర్తిస్తారో ఈ వీడియో ఒక ఉదాహరణ.. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి

డబ్బులు ఉన్న వాళ్ళతో.. డబ్బులు లేని వాళ్ళతో.. ఆసుపత్రులలో ఎలా ప్రవర్తిస్తారో ఈ వీడియో ఒక ఉదాహరణ. తిరువనంతపురం లోని మెడికల్ కాలేజీలో ఓ నర్సింగ్ అటెండర్ బెడ్ మీద పడుకుని ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఆ వృద్ధుడితో ఏదో మాట్లాడుతున్నట్లుగా కనిపించిన అతడు పాపం ఆ పెద్దాయన చేతిని పట్టుకున్నాడు.

చేతిని పట్టుకున్న ఆ కాంపౌండర్ గట్టిగా నొక్కడం మొదలుపెట్టాడు. బెడ్ మీద ఉన్న పేషెంట్ నొప్పితో కదలడం మనం గమనించవచ్చు.. వెళుతూ.. వెళుతూ.. గుద్దాలని కూడా భావించాడు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు రికార్డు చేయించారు. సునీల్ కుమార్ అనే కాంపౌండర్ ఈ పని చేశాడు. బెడ్ మీద ఉన్న పేషెంట్ వద్దకు వచ్చిన సునీల్ కుమార్.. సైలెంట్ గానే తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. ఆ పేషెంట్ బాధతో మూలుగుతుండగా పక్కనే ఉన్న వాళ్ళు రికార్డు చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళను ఏమి చేసినా తప్పు లేదని నెటిజన్లు అంటూ ఉన్నారు. వీడియో ఆసుపత్రి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఆర్థోపెడిక్ వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్చి 19న ఆ వ్యక్తి ఆసుపత్రిలో చేరగా 23వ తేదీన డిశ్చార్జి అయ్యాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)