కేవలం రూ. 75 వేలతో అద్భుతమై కారును రూపొందించారు.

Loading...
సాధించాలనే పట్టుదలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు.అతి తక్కువ ఖర్చుతో ఎక్కవ మైలేజ్ వచ్చే లేటెస్ట్ కారును రూపొందిచారు ఇంజినీరింగ్ విద్యార్థులు. విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం కోమటపల్లిలోని తాండ్రపాపారాయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఓ పాతకారు ఇంజిన్‌తో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కేవలం రూ. 75 వేలతో అద్భుతమై కారును రూపొందించారు.కారు ప్రత్యేకతలు: 
  • కారు తయారీకి ఖర్చు కేవలం రూ. 75 వేలు
  • మైలేజీ 50-60 కిలో మీటర్ల వేగంతో 20-23 కి.మీ. నడుస్తుంది.
  • డ్రైవర్‌తో కలిపి ఆరుగురు ప్రయాణించవచ్చు.
  • అల్ట్రాసోనిక్‌ సెన్సార్ల సహాయంతో నడిచే ఈ కారు ఎదురుగా మీటరు దూరంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా నియంత్రించే అవకాశం
  • మద్యం సేవించి వాహనం నడిపితే కారు కదలదు. ఓనర్‌కు మెసేజ్‌ వెళ్లి వాహనం నిలిచిపోతుంది.
  • వాహనాన్ని ఎవరైనా దొంగిలిస్తే ఆఫ్‌లైన్‌లో కూడా ఎక్కడ ఉందో కనిపెట్టవచ్చు.
కాలేజీ ప్రిన్సిపాల్‌ బి.వెంకటరమణ ఆధ్వర్యంలో మెకానికల్‌ హెడ్‌ కృపారావు, వర్క్‌షాపు ఇన్‌చార్జి నర్సింగరావుల పర్యవేక్షణలో జీఎల్‌ కార్తీక్, వి.సురేష్, ఎన్‌ఎస్‌ శ్రీకాంత్, వి.మణికంఠ, బి.హరీష్‌బాబు, వెంకటరమణ తదితరులు ఈ మల్టీ పర్పస్‌ కారును రూపొందించారు. ఈ కారును బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత శనివారం(మార్చి-31) ప్రారంభించారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులు తలచుకుంటే ఎలాంటి అద్భుతాలైనా సాధించగలరన్నారు. డీఎస్పీ విద్యార్థులను, కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...