న్యూస్ ఛానెల్స్ రేటింగ్ కోసం ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ను స్టూడియోకి తీసుకొచ్చి బ‌జారు వ్యాఖ్య‌లు చేయించి నీచమైన పనులు మొత్తం టీవీ స్టూడియోస్ లోనే చేసేస్తున్నారు

నిజంగా చెప్పాలంటే మీడియా రోజురోజుకీ దిగ‌జారుతోంది. ఎంత‌లా అంటే, ఎవ‌రు బ‌జారు వ్యాఖ్య‌లు చేస్తారా.. ఎప్పుడు వాళ్ల‌ను తీసుకొచ్చి స్టూడియో లో కూర్చోబెట్టి సొల్లు మాట‌ల‌తో సొంగ కార్చుకుందామా అనేంత‌లా..! నిజానికి రాష్ట్రంలో ఎన్నో స‌మ‌స్య‌ల‌తో జ‌నం అల్లాడిపోతుంటే వాటిని ప‌ట్టించుకోకుండా అన‌వ‌స‌ర‌మైన డిబేట్ల‌తో కాల‌యాప‌న చేస్తూ, జనాల‌ను ఆగ‌మాగం చేస్తున్నారు. న్యూస్ ఛానెల్స్ రేటింగ్ కోసం ఎవ‌రిని ప‌డితే వాళ్ల‌ను స్టూడియోకి తీసుకొచ్చి, అర్థం ప‌ర్థం లేని ప్ర‌శ్న‌లు వేస్తూ రెచ్చ‌గొట్టేలా సెటైర్లు వేస్తూ ప‌బ్బం గడుపుకుంటున్నారో లేక‌, పాపులారిటీ కోసం ప‌స‌లేని విష‌యాల‌ను ముంగ‌ట వేసుకుని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ త‌మ ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారో అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టికే ఎంతోమంది మీడియా పుణ్యాన పాపులారిటీ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి ఒక‌రు హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు.

క్యాస్టింగ్ కౌచ్ అంటూ సినీ ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు రావాలంటే చిత్రం ప్ర‌ముఖులు ఏం చెప్తే అది చేయాల‌ని, లేదంటే ఆఫ‌ర్లు రావ‌ని చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. ఒక్క యూట్యూబ్ ఛానెల్ కు ఆమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న విష‌యాలు పొక్క‌డంతో నేరుగా పేరుగాంచిన న్యూస్ ఛానెల్ స్టూడియోలో ద‌ర్శ‌న‌మిచ్చింది.ఇక అక్క‌డి నుంచి ఆమె కోసం ఇటు యూట్యూబ్ ఛానెల్స్, అటు న్యూస్ ఛాన‌ల్స్ క్యూ క‌డుతున్నాయి. ఆమె చెప్పే స‌మాధానాల్లోనే ఓ ప్ర‌శ్నను వెతుకుతూ, దాన్నుంచి మ‌రో క్వ‌శ్చ‌న్ వేస్తూ రేటింగ్ పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.నిజానికి శ్రీరెడ్డికి అన్యాయం జ‌రిగ‌న మాట వాస్త‌వ‌మే అయితే,ఆమెకు న్యాయం చేసే ప్ర‌య‌త్నం చేయాలి.కానీ ఆమె ఆరోప‌ణ‌ల‌ను అడ్డాగా చేసుకుని త‌మ త‌మ స్వ‌లాభం కోసం ఇష్టం వ‌చ్చిన ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తూ జ‌నాల‌ను గంద‌ర‌గోళానికి గురిచేస్తున్నారు. వారు చెప్పిస్తున్నారో లేక‌,శ్రీరెడ్డినే చెప్తుందో తెలియ‌దు కానీ,ప‌చ్చి భూతులు వ్యాఖ్యానించ‌టం, ప‌లువురిపై ఆరోప‌ణ‌లు గుప్పించ‌ట‌, ఆ త‌ర్వాత ఆధారాలు చూపించ‌క‌పోవ‌టం వంటివి జ‌రుగుతున్నాయి.

రాంగోపాల్ వ‌ర్మే రూపాయి పెట్టుబ‌డి లేకుండా సినిమాకు కోట్ల రూపాయ‌ల కాసుల‌ను కొల్ల‌గొడ‌తాడ‌నుకుంటే ఇప్పుడా జాబితాలో శ్రీరెడ్డి చేరిపోయింది. శ్రీరెడ్డి ఫోటో పెట్టి,ఆమె చేసిన వ్యాఖ్య‌ను థంబ్ నెయిల్ గా వ‌దిలితే మిలియ‌న్ల‌లో వ్యూస్ వ‌స్తుండ‌టం విశేషం.అయితే, ఇష్టం లేకుండానే అంత‌మంది చూస్తున్నారా అన్న ప్ర‌శ్న‌కూడా వాళ్ల‌కు ఆయుధంగా మారుతోంది.

సరే…ఆ శ్రీరెడ్డి అనెటామె ప్రాబ్లమేందీ…. అంటే… తెలుగు ఇండస్ట్రీలో తెలుగువాళ్లకు అవకాశాల్లేవట… డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇవ్వడం లేదట. ఇన్ కేస్ ఇస్తేగిస్తే…. వాళ్లకు కావాల్సిన విధంగా… కావాల్సింది ఇవ్వాల్సిందేనని… చాలా బోల్డ్ గా మీడియా ముందుకొచ్చి వాగేసింది. ఆ సిగ్గుమాలిన పని చేస్తున్నపుడు లేని సిగ్గూ-శరం మీడియా ముందుకొచ్చినప్పుడు మాత్రమే ఎందుకుండాలట. ఇది ఆమె టీవీల ముందుకొచ్చి మాట్లాడిన విషయాలు…కానీ…ఈ గత పదిరోజుల నుంచి అబ్జర్వ్ చేసినదాని బట్టి చూస్తే…ఆ అమ్మాయి ఉద్దేశం ఇంకేదో ఉన్నట్లే అనిపిస్తోంది. సరే అంత బోల్డ్ గా టీవీల ముందుకొచ్చి మాట్లాడిన అమ్మాయి… వాళ్ల పేర్లు డీటెయిల్స్ అన్నీ బయటపెట్టొచ్చుకదా. పోనీ తను భయపడిందనుకుందాం. అలాంటప్పుడు ఆమె దగ్గరున్న ఎవిడెన్స్ అన్నీ తీసుకెళ్లి కేసు పెట్టొచ్చుకదా.

గజల్స్ శ్రీనివాస్ లాంటి ప్రముఖుడ్ని ఓ అమ్మాయి ఎంత బోల్డ్ గా ఇరికించిందో చూశాం కదా. కేవలం టీవీల ముందుకు రావడం… నన్ను వాడుకున్నారని వాగేయడం. వాటికితోడు లైవ్ లోనే చెప్పరాని బూతులు… బాబోయ్ సగటు తెలుగు అమ్మాయి కనీసం వినడానికి కూడా ఇష్టపడని బూతులన్నీ మాట్లాడి… చీప్ గా చిల్లర పబ్లిసిటీ కోసం ఆరాటపడుతున్నట్లు అనిపిస్తోంది. అనిపించడమేంటీ…ఈ అమ్మగారి ఇంటర్య్వూల పరంపర కాస్త స్లో కాగానే… ఈమెకు యాంటిగా జ్యోతిలాంటి కొందరు ఆర్టిస్టులు తెచ్చి అదే టీవీల్లో ఇష్యూని లైవ్ లీగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి సదరు ఛానెళ్లు. వాళ్లు అడిగిన క్వశ్చన్స్ కూడా నీళ్లు నములుతూ… సంబంధంలేని సమాధానాలు చెప్పింది శ్రీరెడ్డి.

శ్రీరెడ్డి వాలకం చూస్తుంటే… మరో తారాచౌదరిని తలదన్నేలా కనిపిస్తోంది. కొంతమంది ప్రముఖుల వీడియోలను చేతిలో పట్టుకున్ని అప్పట్లో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అలాగే ఇప్పుడు శ్రీరెడ్డి కూడా. తన దగ్గర కొంతమంది భాగోతాలున్నాయట. వాట్ని తొందర్లోనే లీక్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. మొన్న ఆమె ఫేస్బుక్ పేజ్ లో…. లీక్స్ స్టార్టెడ్ అని ఓ అమ్మాయితో అబ్బాయి ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేసింది. అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ…. సదరు ఫోటోల్లో, వీడియోల్లో ఉన్న వ్యక్తులను బెదిరించి… వాళ్ల నుంచి ఏమైనా ఆశిస్తుందా… ఏంటీ… అనే డౌట్ వస్తోంది. దానికోసమే… ఇన్నాళ్లుగా ఈ బుర్రలేని న్యూస్ ఛానెళ్లను… వ్యూస్ కోసం కక్కుర్తి పడే యూట్యూబ్ ఛానెళ్లను పావుగా వాడుకుందేమోననే అనుమానం కలుగుతోంది. దీనికి తోడు… శ్రీరెడ్డి ఉంటున్న ఇంటి రెంట్ ఆమె మెయిన్ టేనెన్స్ పై కూడా సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు బలం చేకూరుస్తున్నాయి.

ఫైనల్ గా చెప్పొచ్చేది ఒక్కటే… ఆమె స్వార్థ ప్రయోజనాల కోసం ఏదో ఒక పనికి మాలిన టీవీలో కూర్చుని నోటికొచ్చింది వాగింది. అదివిన్న మిగతా ఏ సర్టిఫికెట్ ఛానెల్సన్నీ… మా స్టూడియోకి రండి అని ఆహ్వానం పలుకుతున్నాయి. ఫ్రీ పబ్లిసిటీ కోసం వాటిని పావుగా వాడుకుంటుందో… లేక వాటికి శ్రీరెడ్డి పావులా మారిందో తెలీదు గానీ… కొన్ని ఛానెళ్లనైతే ఏకిపారేస్తున్నారు. ఈ శ్రీ రెడ్డి బ్లో జాబ్ వర్డ్స్… టీవీ5 సాంబశివరావు బూతు డైలాగ్స్ విన్న సగటు సామాన్యుడికి రేటింగ్స్ కోసం ఇక తెలుగు మీడియా ట్రిపుల్ ఎక్స్ వీడియోస్ వేసుకోవడమే అనే డౌట్ వస్తుంది. ఆరోజొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో…!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)