వైద్యం కోసం వచ్చిన వ్యక్తి బంధువుల అశ్లీల చిత్రాలు సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తూ

Loading...
శ్రీకాకుళం రిమ్స్‌లో వైద్యం కోసం వచ్చిన వ్యక్తి బంధువుల అశ్లీల చిత్రాలు సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తూ సెక్యూరిటీ గార్డు దొరికిపోయారు. దీంతో అతడికి రోగి బంధువులతోపాటు అక్కడ ఉన్న మరికొంతమంది దేహశుద్ధి చేశారు. రిమ్స్‌లో ఆస్పత్రిలో ఫిమేల్‌ మెడికల్‌ (ఎఫ్‌ఎం) వార్డులో ఈ సంఘటన శుక్రవారం జరిగింది. రిమ్స్‌లో ఎఫ్‌ఎం వార్డులో నరసన్నపేటకు చెందిన రోగి బంధువు బాత్‌రూమ్‌లో ఉండగా ఆ వార్డులో విధులు నిర్వహిస్తున్న బలగ గ్రామానికి చెందిన ఒక సెక్యూరిటీ గార్డు సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుండటాన్ని కొందరు మహిళలు గమనించారు.

విషయం తెలిసిన మహిళలందరూ దేహశుద్ధి చేశారు. రిమ్స్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ బి.సి.హెచ్‌.అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై ఫిర్యాదు వస్తే ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. రిమ్స్‌లో సెక్యూరిటీ గార్డులు కొంతమంది సరిగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇటీవల జీతాలను కోత పెట్టారు. పూర్తి జీతాల కోసం ఈనెల 9 నుంచి 19 రోజులు సమ్మెచేశారు. కాంట్రాక్టరు, అధికారుల చొరవతో ఈ సమస్య సద్దుమణిగింది. సమ్మె ముగిసిన రెండో రోజుల్లోనే సెక్యూరిటీ సిబ్బంది ఇటువంటి చర్యలకు పాల్ప డడం రిమ్స్‌లో చర్చనీయంశంగా మారింది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...