మంచానికి గుద్దుకుని మరదలు.. ఆ మంచానికి పక్కనే బావ మృతదేహం

వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం భీమారంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో బావ, మరదలు మృతి చెందారు. మంచానికి గుద్దుకుని మరదలు మరణించగా, ఆ మంచానికి పక్కనే బావ మృతదేహం పడి ఉంది. మృతులను వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రావుల ప్రవీణ్‌ రెడ్డి (31), రక్షణ (20)గా గుర్తించారు. ఘటన జరిగినప్పుడు ప్రవీణ్ రెడ్డి భార్య ఇంట్లో లేరు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాయికల్‌ గ్రామానికి చెందిన రావుల ప్రవీణ్‌‌ రెడ్డి భీమారంలోని ఎస్వీఎస్ కాలనీలో భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. వీరితో పాటు అతడి మరదలు రక్షణ కూడా ఉంటోంది.

అయితే.. ప్రవీణ్, రక్షణ మధ్య సాన్నిహిత్యం శారీరక సంబంధానికి దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ విషయం కాస్త ప్రవీణ్ రెడ్డి భార్యకు తెలియడంతో దంపతుల మధ్య వాగ్వాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. భర్త, చెల్లెలి అక్రమ సంబంధంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ఇల్లాలు కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయం అత్తమామలకు తెలిస్తే పరువు పోతుందని భావించిన ప్రవీణ్ రెడ్డి, అతడి మరదలు రక్షణ ఆత్మహత్య చేసుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బుధవారం (మార్చి 28) రాత్రి 11 గంటల సమయంలో ప్రవీణ్‌ రెడ్డి భార్య తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి తిరిగి రాగా.. తలుపు తాళం వేసి ఉంది. ఆమె తాళం పగులగొట్టడానికి ప్రయత్నిస్తుండగానే.. ప్రవీణ్‌ రెడ్డి వెనుక డోరు తీశాడు. దీంతో ఇంటి లోపలికి వెళ్లిన అత్త, మామ అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న రక్షణను చూసి హతాశులయ్యారు. ఆ వెంటనే ప్రవీణ్‌ రెడ్డి కూడా అక్కడే కుప్పకూలిపోయి మరణించాడు.

దీంతో వారు కేయూ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గదిలో సూసైడ్‌ నోట్‌ కూడా లభించినట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌రెడ్డి నిద్రమాత్రలు మింగి లేక క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. రక్షణ తన తలను మంచానికి బాదుకొని మరణించినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాలను చూసి బంధువులు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)