పాపం ఒకేఒక్కసారి లంచ్ కి వెళ్ళాడు తర్వాత తన వాట్సాప్‌కు వచ్చిన వీడియోలు, ఫొటోలు చూసి షాకయ్యాడు

ఫేస్‌బుక్‌ పరిచయం గౌరీశంకర్‌ను బుక్‌ చేసింది. ఓ రోజు తన వాట్సాప్‌కు వచ్చిన వీడియోలు, ఫొటోలు చూసి షాకయ్యాడు. వాటితో బ్లాక్‌ మెయిలింగ్ చేసిన స్నేహ అనే యువతి...భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసింది. చివరికి గౌరీశంకర్‌ ఆమెకు 5 లక్షల 48 వేలు ఇచ్చి... ఇక నో ప్రాబ్లం అనుకున్నాడు. కానీ మరో ఐదు లక్షలు ఇవ్వాలంటూ మళ్లీ బెదిరింపులకు దిగింది. ఆమె టార్చర్ భరించలేక పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు.

ఈ నయా రకం మోసం కర్నాటకలోని బెంగళూరులో వెలుగు చూసింది. ఆ కిలాడీలేడీ ఒక్క గౌరీశంకరకే కాదు అంతకుముందు ఇలాగే చాలామంది జీవితాలతో ఆడుకుంది. ఇంతకీ ఆమె ఎలా వలపు వల వేస్తుందో తెలుసా! రెగ్యులర్‌గా ఫేస్‌బుక్‌ను ఫాలోఅవుతుంది. అందులో పెళ్లయిన మగవారికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్ పెడుతుంది. యాక్సెప్ట్ చేయగానే ఛాటింగ్ మొదలు పెడుతుంది. తను వివాహితను అని... తనకు ఇద్దరు పిల్లలున్నారని చెప్తుంది. ఫ్రెండ్ షిప్ చేద్దామంటూ నైస్‌గా చెప్తుంది. వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ అంటూ ఇన్‌వైట్ చేస్తుంది. డైరెక్టుగా కలిసి మాట్లాడగానే... లంచ్‌కు ఇంటికి ఆహ్వానిస్తుంది. అక్కడే అసలు ట్విస్ట్ ఉంటుందని ఊహించని మగవాళ్లు... ఇరుక్కుపోతారు.

కలిసి లంచ్‌ చేసిన టైంలో కాస్త చనువుగా ఉన్నట్లు నటించి... ఫొటోలు, వీడియోలు తీయిస్తుంది. ఆ తర్వాత వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌ మెయిలింగ్ మొదలు పెడుతుంది. ఆ వీడియోలు, ఫొటోలను అతడి వాట్సాప్‌కు పంపించి భారీగా డబ్బు డిమాండ్ చేస్తుంది. బేరమాడితే ఎంతో కొంత తగ్గిస్తుంది. లేదంటే ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తుంది. మీ కుటుంబసభ్యులకు పంపిస్తానంటూ బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది. వాటితో తమ కుటుంబంలో గొడవలు మొదలవుతాయని భయపడేవారు ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకుంటారు. కానీ ఆమె మాత్రం వీడియోలు, ఫొటోలను అడ్డుపెట్టుకుని మళ్లీమళ్లీ డబ్బు డిమాండ్ చేస్తూనే ఉంటుంది. ఈ విషయం గ్రహించే గౌరీశంకర్‌ సీసీబీ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న కిలాడీ లేడీ జంప్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు... కేసు నమోదు చేసుకున్నారు.ఇంతకుముందు కూడా ఆమె ఇలాంటి మోసాలకు పాల్పడిందని గుర్తించిన పోలీసులు... ఆ కిలాడీ లేడీ కోసం గాలిస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)