మహిళలను చర్చికి పిలిపించి చర్చిలోనే నగ్నంగా ప్రార్ధనలు, బాడీ మసాజ్, భార్య ముందే పరాయి స్త్రీలతో శృంగారం

రాత్రి పూట రమ్మనేవాడు. అదేమంటే, ప్రత్యేక ప్రార్థనలు చేయాలనేవాడు. అక్కడికి వెళ్లాక.. బట్టలు తీయమనేవాడు. ఎందుకని నిలదీస్తే.. నగ్నంగా ప్రార్థిస్తేనే దేవుని కృప దొరుకుతుందని చెబుతాడు. ఇంకా అక్కడ ఉంటే ఏమేమి చేయమంటాడోనని ఆమె అక్కడినుంచి బయటకు పరుగు తీసింది.

ఇది.. పశ్చిమగోదావరి జిల్లా జగన్నాథపురానికి చెందిన ఓ వివాహిత గోడు! డేరా బాబాకి ఏమాత్రం తీసిపోని తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం చర్చి ఫాదర్‌ ఎబినేజర్‌ ‘ప్రార్థనల నెపంతో చేస్తున్న పాపాల’కు ఈమె ఒకానొక బాధితురాలు. పెళ్లయిన పిల్లను లోబరుచుకొని భర్త దగ్గరకు కాపురానికి వెళ్లనీయడం లేదని ఒకరు.. తమ కుమార్తెను వెంట తిప్పుకొంటూ, తమను కూడా చూడనీయడం లేదని మరొకరు.. దేవుని సేవ పేరిట తన మెడలోని బంగారు నగలను తీసేసుకొన్నాడని ఇంకొకరు.. ఇలా ఆ పాస్టర్ బారినపడ్డ బాధితులు ముందుకొస్తున్నారు.

తణుకు మండలం దువ్వకు చెందిన ఎబినేజర్‌ తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం జగన్నాథపురం వచ్చేశారు. ఇక్కడే ఎబినేజర్‌ పుట్టాడు. అక్కడే చర్చి ఫాదర్‌గా ఎదిగాడు. సియోన్‌ అనే మహిళతో 2003లో అతనికి వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఎబినేజర్‌ శాడిజంతో వేగలేక భార్య వెళ్లిపోయింది. ‘పెళ్లయిన తొలి ఏడాది బాగున్నాడు. అక్కడినుంచి చెప్పలేనంతగా చిత్రవధ చేశాడు. నా కళ్ల ముందే పరాయి స్త్రీలతో శృంగారం. అది చూడలేక బయటకొచ్చా. నాకు భరణం ఇప్పిస్తే.. నా బతుకు నేను బతుకుతా’నని సియోను కన్నీరుమున్నీరయింది.

యువతులకు ఉచ్చులు పరిచే ఎబినేజర్‌.. భార్య అడ్డు కూడా తొలగిపోవడంతో మరింతగా రెచ్చపోయాడు. ఎబినేజర్‌ జగన్నాథపురం చర్చితోపాటు, ప్రకాశరావుపాలెం, జగన్నపేట, మద్దూరు తదితర ప్రాంతాల్లోని చర్చిల పర్యవేక్షకుడు. జగన్నాథపురం చర్చిలో ఎక్కువ సమయం గడుపుతాడు. ప్రార్థనల కోసం వచ్చే మహిళలకు ఏదోపేరుతో దగ్గరవడం, క్రమంగా లోబరుచుకోవడం పనిగా పెట్టుకొన్నాడు. దైవాన్ని చూపిస్తానని రాత్రివేళల్లో మహిళలను చర్చికి పిలిపించి.. నగ్నంగా ప్రార్థించాలని ఒత్తిడి తెచ్చేవాడు. దీనిపై 2015లో ఎబినేజర్‌పై తొలి కేసు నమోదయింది. అరెస్టు భయంతో కొంతకాలం కనిపించకుండాపోయాడు. ముందస్తు బెయిల్‌ తీసుకొని.. తిరిగి మహిళలను వంచించడం మొదలుపెట్టాడు.
చర్చిని పాప కార్యాలకు విడిదిగా మార్చినట్టు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. జగన్నాథపురం చర్చిని పోలీసులు మూసి వేశారు. అయినా.. ఎబినేజర్‌ తగ్గలేదు. అక్కడే మరోచోట చర్చిని నిర్మించాడు. శుక్ర, ఆదివారాల్లో ప్రార్థనలకు వస్తున్న యువతులను, వివాహితలను, వితంతువులను ప్రత్యేక ప్రార్థనల పేరిట నమ్మించి.. వారిని ఆర్థికంగా, శారీరకంగా వంచించేవాడు. ఈ క్రమంలో నెల క్రితం అతడిపై కేసును కోర్టు కొట్టి వేసింది. దీంతో.. మరింత రెచ్చిపోయాడు.

ఫాదర్‌ అనే అభిమానంతో కొంత, అతడి పలుకుబడికి భయపడి మరికొంత తొలుత బయటకురావడానికి బాధిత మహిళలు వెనుకాడారు. ఎబినేజర్‌ వేధింపులు తీవ్రం కావడంతో.. ఇప్పుడు వారంతా గళం విప్పారు. వీరికి మద్దతుగా బుధవారం రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి జగన్నాథపురం వచ్చారు. పాస్టర్‌ దగ్గర చిక్కుకుపోయిన తమ బిడ్డలను విడిపించాలని బాధిత తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

రాష్ట్రంలో మరో డేరా బాబాలా తయారయిన ఎబినేజర్‌పై చర్య తీసుకోవాలని కలెక్టర్‌, ఎస్పీలను నన్నపనేని కోరారు. ఫాదర్‌ ఆధీనంలోని యువతులను, వివాహితలను బయటకుతెచ్చి.. మహిళా హాస్టల్‌లో ఉంచుతామని భరోసా ఇచ్చారు. ‘‘ఎబినేజర్‌ను వదిలిపెట్టం. మీరు ఒక్క ఫిర్యాదు ఇవ్వండి. అతని ఆట కట్టిస్తాం. ఎవరూ భయపడొద్దు. మీ వెంట కమిషన్‌, ప్రభుత్వం ఉన్నాయనేది మరిచిపోవద్దు’’ అని ధైర్యం చెప్పారు. ఓ ఐదుగురు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కాగా, ఎబినేజర్‌కి అనుకూలంగా కొంతమంది జగన్నాథపురంలో ధర్నా జరిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)