పగలు సీరియల్స్ షూటింగ్ లో నటిస్తూ ఉంటుంది రాత్రి పూట రోడ్డు పక్కన దోశలు వేస్తూ

మోసగాళ్ల చేతిలో పడి మోసపోయే వారి జాబితాలో ఎంతటి పెద్దమనుషులుంటే అంతటి పెద్దస్థాయిలో మోసపోవడం ఖాయం. అందుకే కాబోలు బండ్లు ఓడలవుతాయ్.. అన్న నానుడి కూడా వచ్చింది. ఇప్పుడీ అంశంపై ఎందుకు చర్చిస్తున్నామంటే.. ఓ టీవీ నటి కూడా ఇలాంటి అరచేతిలో వైకుంఠం చూపే.. అకాశానికి మెట్టు వేశామన్నవారి మాట్లల్లో పడింది. ఫలితంగా తన కొడుకు జీవితం బాగుండాలని, తన కూతురుకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదని భావించిన అమె చివరకు రాత్రైతే చాలు వ్యాపారాన్ని మొదలుపెట్టేస్తుంది. వచ్చిన రూపాయి, అర్థ కూడా తమ పిల్లల భవితవ్యానికి దోహదం చేస్తుందని యోచిస్తుందామె. ఇంతకీ ఎవరా నటి అంటారా..?
కవితా లక్ష్మి... మలయాళ టీవీ నటి. పగలు సీరియల్స్ షూటింగ్ లో నటిస్తూ ఉంటుంది. కానీ అనుకోకుండా వచ్చిన అర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో ఆమె సంపాదన చాలకపోవడంతో.. కుటుంబపోషన కోసం రాత్రి పూట రోడ్డు పక్కన వ్యాపారం చేస్తూ దోహదపడుతుంది. అయితే ఇదే అమెను మలయాళీ ప్రేక్షుకులకు మరింత దగ్గర చేసింది. అమె వ్యాపారం తాలుకు వీడియో ఒక్కసారిగా వైరల్అ్యయ్యింది. అసలేం జరిగింది..? అమె చేస్తున్న వ్యాపారమేంటి.? అన్న ప్రశ్నలు మీకూ కలుగుతున్నాయా..? కవితా లక్ష్మీ రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్ పెట్టుకుని దోసలను విక్రయిస్తుంది.

పెనంపై దోశలు వేస్తూ, వాటిని అమ్ముకుంటూ అదనపు డబ్బు సంపాదిస్తూ, తన కుటుంబం కోసం కష్టపడుతున్న నటి కవితా లక్ష్మీ హోటల్ లో దోసలను అరగించిన ఓ వ్యక్తి అమెను మలయాళ టీవీ నటిగా గుర్తించాడు. అంతేకాదు అమె సూపర్ హిట్ సీరియల్ 'స్త్రీధనం'లో కూడా శాంత పాత్ర ఎంతో గుర్తింపు తెచ్చుకుందని గ్రహించి అమెను టిఫిన్ చేసిన తరువాత అమెతో మాట కలపి అమె వీడియోను రికార్డు చేసి దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో.. అది కాస్తా వైరల్ అయ్యింది.

దీంతో రంగంలోకి దిగిన 'మనోరమా ఆన్ లైన్' అమె ఇంటర్వ్యూను తీసుకుంది. అందులో అమె తన తన వేదనను వ్యక్తం చేశారు. ఉన్నత చదువుల కోసం తన కుమారుడిని యూకే పంపిన అమెకు అప్పట్లో ట్రావెల్ ఏజెన్నీలు పలు హామీలు గుప్పించాయి, అయితే.. అక్కడికి వెళ్లిన తమ అభ్బాయికి పార్ట్ టైం జాబ్ లభించలేదని, తమను ట్రావెల్ ఏజెన్సీ మోసం చేసిందని గ్రహించిన తాను.. ఇక కుటుంబ పోషణ కోసం గ్రానైట్ వ్యాపారం పెట్టినా అది కలసిరాలేదని, దీంతో తాను ఇలా రోడ్డు పక్కన చిన్న హోటల్ ను తీసుకుని దోశలు వేస్తున్నానని చెప్పింది.దీంతో రంగంలోకి దిగిన 'మనోరమా ఆన్ లైన్' అమె ఇంటర్వ్యూను తీసుకుంది. అందులో అమె తన తన వేదనను వ్యక్తం చేశారు. ఉన్నత చదువుల కోసం తన కుమారుడిని యూకే పంపిన అమెకు అప్పట్లో ట్రావెల్ ఏజెన్నీలు పలు హామీలు గుప్పించాయి, అయితే.. అక్కడికి వెళ్లిన తమ అభ్బాయికి పార్ట్ టైం జాబ్ లభించలేదని, తమను ట్రావెల్ ఏజెన్సీ మోసం చేసిందని గ్రహించిన తాను.. ఇక కుటుంబ పోషణ కోసం గ్రానైట్ వ్యాపారం పెట్టినా అది కలసిరాలేదని, దీంతో తాను ఇలా రోడ్డు పక్కన చిన్న హోటల్ ను తీసుకుని దోశలు వేస్తున్నానని చెప్పింది.

తన అబ్బాయి చదువుకు అవసరమయ్యే ఫీజును ఇప్పుడు తానే పంపాల్సి వుందని, అందువల్లే ఇలా హోటల్ నడుపుతున్నానని చెప్పింది. ప్రస్తుతం తన చేతిలో రెండు సీరియల్స్ ఉన్నాయని, అ డబ్బుతో పాటు, హోటల్ ద్వారా సంపాదించే డబ్బునూ కుమారుడికి పంపుతున్నట్టు చెప్పింది. కాగా, ఈ హోటల్ నెయ్యత్తినకరా పరిధిలోని నిమ్స్ ఆసుపత్రి సమీపంలో ఉండగా, స్థానికుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఇక తన కూతురుకు భవిష్యత్తు కోసం కూడా తాను పాటుపడాలని, అయితే తాను అథ్రటిస్ సహా హృదయ సంబంధిత వ్యాదులతో బాధుతున్నట్లు కూడా తెలిపింది. ఇక దీంతో అమెపై మలయాళ ప్రేక్షకులు ఎంతటి అదరణ కనబరుస్తున్నారో.. మాటల్లో చెప్పలేం.తన అబ్బాయి చదువుకు అవసరమయ్యే ఫీజును ఇప్పుడు తానే పంపాల్సి వుందని, అందువల్లే ఇలా హోటల్ నడుపుతున్నానని చెప్పింది. ప్రస్తుతం తన చేతిలో రెండు సీరియల్స్ ఉన్నాయని, అ డబ్బుతో పాటు, హోటల్ ద్వారా సంపాదించే డబ్బునూ కుమారుడికి పంపుతున్నట్టు చెప్పింది. కాగా, ఈ హోటల్ నెయ్యత్తినకరా పరిధిలోని నిమ్స్ ఆసుపత్రి సమీపంలో ఉండగా, స్థానికుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఇక తన కూతురుకు భవిష్యత్తు కోసం కూడా తాను పాటుపడాలని, అయితే తాను అథ్రటిస్ సహా హృదయ సంబంధిత వ్యాదులతో బాధుతున్నట్లు కూడా తెలిపింది. ఇక దీంతో అమెపై మలయాళ ప్రేక్షకులు ఎంతటి అదరణ కనబరుస్తున్నారో.. మాటల్లో చెప్పలేం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)