పొట్ట తగ్గటానికి చాలా ముఖ్యమైన 14 టెక్నిక్స్

మనిషి ఆకృతిలో బాగా ఇబ్బందిపెట్టేది పొట్ట భాగమే అని చాలామంది చెప్పే మాట. కాస్త లావయినా వెంటనే పొట్ట ముందుకు పొడుచుకు వస్తుంది. ఇక ఆ తర్వాత వారికి ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అందుకే పొట్ట పెరిగితే దాన్ని తగ్గించుకోవాలి. ఎలాగంటే…
ఉప్పు తగ్గించాలి: మీరు తీసుకొనే ఆహారంలో ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత చెత్తగా మార్చుతుంది. తక్కువ ఉప్పు తినడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.
బాగా నిద్రపోండి: మీ పొట్టను కరిగించుకోవాలంటే ఎక్కువగా నిద్రపోవాలి. ఎక్కువగా అంటే రోజుకు సరిపడా కనీసం ఎనిమిది గంటల సమయం నిద్రపోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కాబట్టి, తగినంత నిద్రపోండి. పడుకొనేప్పుడు బోర్లా పొడుకోవడం వల్ల పొట్ట కండరాలు లోపలికి ఒత్తుకోవడం వల్ల కొవ్వు విచ్చన్నం కాబడుతుంది.
గ్రీన్ వెజిటేబుల్ తినాలి: మీరు ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం వ‌ల్ల‌ బ్రొకోలి, కాకరకాయ, మరియు క్యాబేజ్ జ్యూస్ వంటివి మీరు త్వరగా బరువు తగ్గడానికి మరియు మీ పొట్టకరిగించుకోవడానికి సహాయపడుతాయి.
ఫ్యాట్ ఫుడ్స్‌ను నివారించండి: మీరు పొట్టకరిగించుకోవాలని ఖచ్ఛితంగా నిర్ణయించుకొన్నట్లైతే, ఫ్యాట్ ఫుడ్స్ ను తినడం పూర్తిగా నివారించాలి. జంక్ ఫుడ్, ఫ్త్రెడ్ ఫుడ్ మరియు చిప్స్ వంటి వాటికి మీరు ఖచ్చితంగా దూరంగా ఉంచాలి.
పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేయండి: మీకు సమయం దొరికినప్పుడల్లా మీ బెల్లీ తగ్గడానికి, పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేయండి . మీ నడుమును సైడ్ టు సైడ్ త్రిప్పుతుండాలి. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఇది ఒక సులభ వ్యాయామం.
లోతుగా శ్వాస పీల్చండి: మెడిటేషన్ భంగిమలో లోతుగా శ్వాస పీల్చడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ ను వదులు చేయడానికి సహాయపడుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా, ఈ మెడిటేషన్ భంగిమన శ్వాస వ్యాయామాన్ని రెగ్యులర్ గా చేయండి.
పొటాషియంను పెంచండి: మీ బెల్లీ తగ్గించుకోవాలంటే, మీరు తీసుకొనే పొటాషియం కంటెంట్ ను పెంచాలి. శరీరంలో తక్కువ పొటాషియం ఉండటం వల్ల కడుపు ఉబ్బరంగా ఉండటానికి కారణం అవుతుందని, నిపుణుల అభిప్రాయం.
ఎక్కువ ద్రవాలు: బెల్లీఫ్యాట్ కరిగించుకోవాలంటే నీళ్ళు మీ బ్రెస్ట్ ఫ్రెండ్ వంటిది. ఎక్కువగా నీళ్ళు త్రాగడం వల్ల ఫ్లాట్ బెల్లీని పొందవచ్చు.
ఫైబర్ ఫ్రెండ్స్: బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి, మీ రెగ్యులర్ డైట్ లో ఫైబర్ ను అధికంగా చేర్చుకోవాలి. ఓట్స్, రోటీ మరియు బ్రౌన్ బ్రెడ్ వంటి ఆహారాలు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తప్పనిసరిగా మీ బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు.
సైక్లింగ్: సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణంను పరిరక్షించడం మాత్రేమే కాదు, బెల్లీఫ్యాట్ ను కూడా తగ్గించుకోవచ్చు. ఒక గంట సైకిల్ తొక్కడం వల్ల మీరు 14 రోజుల్లో ఒక అద్భుత మార్పును గమనించవచ్చు.
వాటర్ ఫుడ్స్: నీరు అధికంగా ఉండే ఆహారాలు, పీయర్స్ మరియు వాటర్ మెలోన్ వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల, శరీరంలోని టాక్సిన్స్ తొలగింపబడి, బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.
నిదానంగా తినాలి: మీరు తీసుకొనే ఆహారం చాలా నిదానంగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు నిదానంగా తినడం మొదలు పెట్టి, అలవాటుగా మార్చుకుంటారో, ప్రేగులకు జీర్ణించే శ్రమ తగ్గి, బెల్లీ ఫ్యాట్ కరగడానికి మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మనస్పూర్తిగా, బిగ్గరగా ఎక్కువగా నవ్వాలి: మీ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలంటే, ఎక్కువగా మీరు బిగ్గరగా నవ్వడానికి ప్రయత్నించండి. నవ్వడం వల్ల మీ కడుపులోని కండరాలకు వ్యాయామంలా సహాయపడుతుంది . అందువల్ల మీరు బెల్లీ ఫ్యాట్ కరిగించే అవకాశం ఉంది.
నడక: ఒక మంచి స్నేహితులతో కలిసి, నడక సాధించండి. నడక వల్ల మీరు బెల్లీ ఫ్యాట్ మాత్రమే కరిగించుకోవడం కాదు, మీ కాళ్ళు కూడా సన్నగా నాజూగ్గా మారుతాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)