(వీడియో) భద్రాద్రి రాములవారి కల్యాణంలో మతసామరస్యం వెల్లివెరిసింది. కల్యాణానికి వచ్చిన భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు ముస్లిం సోదరులు

భద్రాద్రిలో రాములోరి కల్యాణం చూడముచ్చటగా జరిగింది. జగమంతా చూస్తుండగా జానకమ్మను.. రామచంద్రుడు మనువాడారు. సంప్రదాయం ప్రకారం అభిజిత్ లగ్నములో రాముడు.. సీతమ్మ మెడల తాళి కట్టారు. భద్రాద్రి రాములవారి కల్యాణంలో మతసామరస్యం వెల్లివెరిసింది. కల్యాణానికి వచ్చిన భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు ముస్లిం సోదరులు.

ప్రతీ ఏటా శ్రీరామనవమి రోజు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ముస్లింలు. రాములోరి కల్యాణం చూసేందుకు దూర ప్రాంతాలనుంచి భద్రాచలంకు భక్తులు వస్తుంటారని… వేసవి నుంచి సేదతీర్చేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. గత మూడేళ్లుగా మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. ముస్లిం సోదరులు చేపట్టిన సామాజిక సేవ చాలా సంతోషంగా ఉందంటున్నారు భక్తులు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)