బరువు తగ్గడానికి అన్నింటికన్నా సులభమైన మార్గం కీరదోస నీళ్లు తాగడం. ఇవి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ

* ఇవి తయారు చేసుకోవడం కూడా సులువే. కీరను పలుచని ముక్కలుగా కోసి తాగే నీళ్లలో వేయాలి. అరగంటయ్యాక తాగొచ్చు. అయితే నీళ్లలో ముక్కలు మాత్రం ఒకరోజు కన్నా ఎక్కువ ఉంచకూడదు. కావాలంటే రుచి కోసం నిమ్మరసం కూడా కలపొచ్చు.
* ఈ నీళ్లు రోజూ తాగడం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య రాకుండా ఉంటుంది. ఈ నీళ్లలోని కీరదోస ముక్కల్ని కూడా తినొచ్చు.
* దోసలో విటమిన్లూ, మినరళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
* బరువు తగ్గించడంలో ఈ నీటి పాత్ర మెండు. ఆకలిగా అనిపించినప్పుడు కీరదోస నీళ్లు తాగితే పొట్టనిండిన భావన వస్తుంది.
* ఈ నీటిలో పుష్కలంగా ఉండే విటమిన్‌-కె, మాంసకృత్తులు... ఎముకలూ, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
* ఈ నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లూ, విటమిన్‌ సి మాంగనీసు, బీటాకెరోటిన్‌ గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి.
* నోటి నుంచి దుర్వాసన వస్తుంటే ఈ నీళ్లను క్రమం తప్పకుండా తాగిచూడండి. నోట్లో ఉండే బ్యాక్టీరియాను చంపి ఈ సమస్య తగ్గు ముఖం పడుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)