(వీడియో) రేప్ చేసిన నలుగురిని ఊరేగించిన పోలీసులు.. వాళ్ళని చూసి అమ్మాయిలు ఎలా రెచ్చిపోయరో

యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు రేపిస్టులను పోలీసులు భోపాల్‌ పట్టణ వీధుల్లో బహిరంగంగా పరేడ్‌ చేయించారు. 20 ఏళ్ల కాలేజ్‌ విద్యార్థిని మహారాణా ప్రతాప్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఉదయం ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు అదేరోజు నిందితులను అదుపులోకి తీసుకుని పట్టణ వీధుల్లో తిప్పారు. రేపిస్టులపై ఈ సందర్భంగా పలువురు యువతులు, మహిళలు చెప్పులతో దాడి చేశారు. నిందితుల్లో ఒకరైన 21 ఏళ్ల శైలేంద్ర దంగి బాధితురాలి కాలేజ్‌లో ఆమె కన్నా ఏడాది సీనియర్‌. శనివారం ఎంపీ నగర్‌ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు రావాలని ఆమెను కోరాడు.

రెస్టారెంట్‌లో కలుసుకున్న వీరిద్దరికీ ఓ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆమె సెల్‌ఫోన్‌ లాక్కున్న శైలేంద్ర బాధితురాలిని అక్కడకు సమీపంలోని తన స్నేహితుడు సోనూ దంగీ రూమ్‌కు తీసుకువెళ్లాడు. అప్పటికే సోనూతో పాటు అక్కడ మరో ఇద్దరు స్నేహితులు ధీరజ్‌ రాజ్‌పుట్‌, చిమన్‌ రాజ్‌పుట్‌లున్నారు. సోను, చిమన్‌లు సహకరించగా శైలేంద్ర, ధీరజ్‌ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను విడిచిపెడుతూ ఈ విషయం ఎవరికైనా చెబితే తనను, తన కుటుంబాన్ని హతమారుస్తామని హెచ్చరించారు. ఆదివారం ఉదయం ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో భోపాల్‌ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితులందరూ నేరాన్ని అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళల్లో ధైర్యాన్ని నింపి వేధింపుల ఘటనలపై వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తారనే ఉద్దేశంతోనే నిందితులను వీధుల్లో తిప్పామని భోపాల్‌ ఐజీ జైదీప్‌ కుమార్‌ చెప్పారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)