అతను 16, ఆమె 20..: పెళ్లి తర్వాత 15రోజులకే అతనో పెద్ద షాక్ ఇచ్చాడు ?

కర్ణాటకలోని దొడ్డబళ్లాపురంకు చెందిన ఓ యువతి(20) స్థానికంగా డిగ్రీ చదువుతోంది. ఆమె దివ్యాంగురాలు. 5నెలల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా బేగూరుకు చెందిన ఓ అబ్బాయి(16)తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
పరిచయం కాస్త కొద్దిరోజులకు ప్రేమగా మారింది. మొదట్లో ఫోన్లకు పరిమితమైన ఇద్దరు ఆ తర్వాత అప్పుడప్పుడూ బయట కలుస్తుండేవారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇంట్లో చెప్పకుండా నెల రోజుల క్రితం ఎక్కడికో వెళ్లిపోయారు.
ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత వారి గురించి ఇరు కుటుంబాల వాళ్లు చాలా చోట్లా వెతికారు కానీ ఎక్కడా దొరకలేదు. కొద్దిరోజుల క్రితమే వారిద్దరి ఆచూకీ దొరికింది. బాగేపల్లిలోని ఓ దేవాలయంలో వారిద్దరు వివాహం చేసుకున్నారని, అక్కడే ఓ స్నేహితుడి ఇంట్లో ఉంటున్నారని యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది.
యువతి ఆచూకీ తెలియడంతో.. బాగేపల్లికి వెళ్లి ఆ ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చారు ఆమె కుటుంబ సభ్యులు. చట్టబద్దంగా ఇద్దరి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నారు. దీంతో ఇందుకు అవసరమైన పత్రాలు తీసుకొస్తానని చెప్పి ఆ బాలుడు తమ ఇంటికి వెళ్లాడు. ఆపై అతను మళ్లీ తిరిగిరాకపోవడంతో యువతి తల్లిదండ్రులను పోలీసులను ఆశ్రయించారు. ఎట్టకేలకు పోలీసులు ఆ బాలున్ని పట్టుకుని రాగా.. ఆ యువతి ఎవరో తనకు తెలియదంటూ పెద్ద షాక్ ఇచ్చాడు.
పెళ్లి చేసుకుని 15రోజులు కాపురం కూడా చేసినవాడు.. తీరా ప్లేటు ఫిరాయించేసరికి యువతి తల్లిదండ్రులు తలపట్టుకున్నారు. బాలుడు మైనర్ కావడంతో పోలీసులు సైతం ఈ కేసును ఎలా డీల్ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఆ యువతి మాత్రం తన భర్త తనకు కావాలని పట్టుబడుతోంది. కేసును పరిష్కరించేందుకు న్యాయ నిపుణుల సలహా కోసం సంప్రదిస్తామని పోలీసులు చెబుతున్నట్టు సమాచారం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)