(వీడియో) రైల్లోనుంచి బురదలో పడి అమ్మాయి నరకయాతన.. రైల్వే గ్యాంగ్‌మెన్ గమనించి కాపాడారు.. మంచి పని చేసిన గ్యాంగ్ మెన్ సోదరులని అభినందించండి

రైలు నుంచి కింద పడి ఓ యువతి బురదలో కూరుకుపోయింది. కదులుతున్న రైల్లోంచి బురదలో పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ యువతి బురదలోనే నరకయాతన అనుభవించింది. తనను కాపాడేందుకు ఎవరైనా రాకపోతారా అన్నట్టు ఎదురు చూస్తున్న ఆ యువతిని అటువైపుగా వెళ్లిన రైల్వే గ్యాంగ్‌మెన్ గమనించి కాపాడారు. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రాజేశ్వరి అనే యువతి విజయవాడ నుంచి పూరీ ఎక్స్‌ప్రెస్‌లో సొంతూరుకు పయనమైంది. అయితే ఆకివీడు-గుమ్ములూరు వద్ద ఆమె రైలు తలుపు దగ్గరకు వెళ్లి నిలబడడంతో ప్రమాదవశాత్తూ జారి కిందపడిపోయింది. ఆ ప్రాంతంలో బురద ఎక్కువగా ఉండడంతో అందులో కూరుకుపోయింది. దాంతో అపస్మారక స్థితిలోకి చేరుకుని చిన్నగా మూలగసాగింది. 


ఐదారు గంటల పాటు అలాగే బురదలో ఉన్న ఆ యువతిని.. పట్టాలు రిపేరుచేస్తూ అటుగా వచ్చిన రైల్వే గ్యాంగ్‌మెన్ గోపాలకృష్ణ, రాంబాబు, కనకరావు, మహేష్, మణికుమార్‌లు గుర్తించి సత్వరమే స్పందించారు. ఆ యువతిని బురదలో నుంచి బయటకు తీసి సపర్యలు చేశారు. అనంతరం అంబులెన్స్‌కు ఫోన్ చేసి భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగానే ఉందని, ఆమె బంధువులు ఆ యువతిని భీమవరంలోని ఒక ప్రవేటు ఆసుపత్రికి తరలించారని రైల్వే పోలీసులు చెబుతున్నారు. సకాలంలో స్పందించి రాజేశ్వరి ప్రాణం కాపాడిన రైల్వే గ్యాంగ్‌మెన్‌ను స్థానికులు అభినందించారు. ఆ వీడియో ని చూడండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)