ప్రార్థన చేస్తూనే తన కన్ను పొడుచుకుని అమ్మవారికి అర్పించింది.. అది చూసి అక్కడున్న భక్తులంతా షాకయ్యారు

పట్నా: పరమేశ్వరుడికి కన్ను తీసి ఇచ్చిన ‘భక్తకన్నప్ప’ కథ మనందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనే బిహార్‌లో చోటుచేసుకుంది. ఓ 16 ఏళ్ల బాలిక అమ్మవారి ఆలయానికి వెళ్లి అందరూ చూస్తుండగానే తన కన్ను అర్పించి అందరినీ షాక్‌కు గురిచేసింది.

వివరాల్లోకెళితే..దర్భాంగ జిల్లాలోని బహేరీ ప్రాంతానికి చెందిన కోమల్‌ కుమారి అనే బాలిక ఛైత్ర నవరాత్రుల్లో భాగంగా దగ్గర్లోని అమ్మవారి ఆలయానికి వెళ్లింది. ప్రార్థన చేస్తూనే తన కన్ను పొడుచుకుని అమ్మవారికి అర్పించింది.

అది చూసి అక్కడున్న భక్తులంతా షాకయ్యారు. వెంటనే బాలికను ప్రథమ చికిత్స నిమిత్తం దగ్గర్లోని మెడికల్‌ సెంటర్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో దగ్గర్లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. కోమల్‌ అమ్మవారి భక్తురాలని గత పదేళ్లుగా ఇలాంటి పండుగల సమయంలో ఉపవాసాలు, పూజలు చేస్తుంటుందని స్థానికులు తెలిపారు. అమ్మవారు కలలో కనపడి అవయవదానం చేయాలని చెప్పిందని కోమల్‌ తమతో చాలా సార్లు అంటుండేదని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)