పక్కనే భార్య.. అందరూ నిద్రపోతున్నారని బస్సులో మరో యువతిపై సైలెంట్ గా..

గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన మన్నె రవిచంద్ర హైద్రాబాద్‌లో వ్యాపారం చేస్తుంటాడు. గచ్చిబౌలిలో ఉంటూ హస్టళ్ళు నడుపుతున్నాడు శుక్రవారం రాత్రి విజయవాడ నుండి హైద్రాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేట్ బస్సులో తన భార్యతో కలిసి బయలుదేరాడు. అదే బస్సులో ఓ ఎంబిఏ చదువుతున్న విద్యార్ధిని ఎక్కింది. ఆమెకు కాబోయే భర్త కూడ అదే బస్సులో ఉన్నాడు. రాత్రి పూట ఆ యువతి పై బెర్తులో పడుకొంది. తెల్లవారుజామున బస్సులో అందరూ నిద్రిస్తున్న విషయాన్ని గుర్తించిన రవిచంద్ర ఎంబీఏ విద్యార్ధిని పక్కనే నిలబది అసభ్యంగా ప్రవర్తించాడు. మెలకువ వచ్చిన బాధిత యువతి కేకలు వేసింది. దీంతో నిందితుడు డ్రైవర్ క్యాబిన్‌లోకి వెళ్ళాడు.
బస్సులో సీట్లు లేకపోవడంతో డ్రైవర్ పక్క సీటులోనే కూర్చొన్న రవిచంద్ర, తెల్లవారుజామున బస్సు హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోకి రాగానే బస్సులోనికి వెళ్ళాడు. అక్కడ ఎంబిఏ విద్యార్ధిని వద్దకు వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సులో అందరూ కూడ నిద్రపోతున్నారని గమనించి విద్యార్ధిని పక్కనే నిలబడి అత్యంత అసభ్యంగా ప్రవర్దించాడు. అయితే ఈ విషయమై యువతికి కాబోయే భర్త నిందితుడిని నిలదీశాడు. షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశాడు. బస్సులోని ప్రయాణీకులు నిందితుడికి బుద్దిచెప్పాలని నిర్ణయం తీసుకొని హయత్‌నగర్ పోలీసులకు అప్పగించారు.
బస్సులో నిద్రిస్తున్న ఎంబిఏ విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యాపారి రవిచంద్రను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. మహిళా ప్రయాణీకులకు భద్రతను కల్పిస్తామని డీసీపీ ఎంవీ రావు చెప్పారు. వేధింపులకు ఎవరైనా పాల్పడితే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)