మ‌రో సెక్స్ వీడియో రాకెట్ వెలుగులోకి.. వీడియోలు వాట్స‌ప్‌ల‌ల్లో లీక్ కావ‌డం.. నెల‌రోజులలో నాలుగోసారి

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలో మ‌రో సెక్స్ వీడియో రాకెట్ వెలుగులోకి వ‌చ్చింది. ఇలా సెక్స్ వీడియోలు వాట్స‌ప్‌ల‌ల్లో లీక్ కావ‌డం.. నెల‌రోజుల వ్య‌వ‌ధిలో నాలుగోసారి. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌కు సంబంధించిన‌దే కావ‌డం ప‌రిపాల‌న యంత్రాంగంలో అల‌జ‌డి రేకెత్తిస్తోంది.

భువ‌నేశ్వ‌ర్ శివార్ల‌లోని ర‌సూల్‌గ‌ఢ్‌లో ఈ వీడియో చిత్రీక‌రించిన‌ట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా- వ‌రుస‌గా సెక్స్ వీడియోలు లీక్ కావ‌డం వెనుక ఏదైనా భారీ రాకెట్ ఉండొచ్చ‌నే సందేహాలు త‌లెత్తుతున్నాయి. మొద‌టిసారిగా ఈ వీడియో భ‌ద్ర‌క్ జిల్లా చంద్‌బాలి గ్రామంలో వెలుగు చూసింది.

అనంత‌రం.. అది వాట్స‌ప్ గ్రూపుల్లో స‌ర్క్యులేట్ అయ్యింది. ఓ ప్రైవేటు సంస్థ య‌జ‌మాని.. త‌న వ‌ద్ద ప‌నిచేసే ఉద్యోగినితో సాగించిన రాస‌లీల‌ల ఉదంతం ఇందులో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇదివ‌ర‌కు ఖుర్ధా, న‌యాగ‌ఢ్‌, కేంద్ర‌పారా జిల్లాల్లో ఇలాంటి వీడియోలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)