(వీడియో) మట్టిలో పండంటి పసిపాప దొరికింది.. దాదాపు 10 నుంచి 15 గంటలపాటు పాప మట్టిలో ఉన్నట్టు గుర్తించారు

మట్టిలో పండంటి పసిపాప దొరికింది.. చిత్రంగా మట్టిలోనే గంటలపాటు గడిచినా పాప సురక్షితంగానే ఉండటాన్ని చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కర్ణాటకలో జరిగింది. పొలంలో పనిచేసుకునే మహిళకు ఎక్కడినుంచో పసిపాప ఏడుపు వినిపించసాగింది. దీంతో వెతుకుంటూ ఆ ప్రదేశానికి వచ్చింది. మట్టిలో పసిపాప ఉండటాన్ని చూసిన ఆ మహిళ వెంటనే మట్టిని తొలగించి బయటకు తీసింది. హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా పాప సురక్షితంగానే ఉన్నట్టు వైద్యులు తెలియజేశారు. దాదాపు 10 నుంచి 15 గంటలపాటు పాప మట్టిలో ఉన్నట్టు గుర్తించారు.. పైగా సురక్షితంగా ఉండటాన్నిచూసి వైద్యులు ఆశ్చర్యపోతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)