పెద‌నాన్న వికృత స్వ‌రూపాన్ని ప‌సిగ‌ట్ట‌లేక‌పోయింది.. చ‌నిపోయిన త‌న తమ్ముడి కూతుర్ని రెండేళ్లుగా అత్యాచారం

నాలుగేళ్ల ప‌సిప్రాయంలోనే ఓ ప్ర‌మాదంలో త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిందా యువ‌తి. త‌న పెద‌నాన్న పెంప‌కంలో పెరిగింది. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించింది. పెద‌నాన్న‌లోనే త‌ల్లిదండ్రుల‌ను చూసుకుంది. అలాంటి పెద‌నాన్న వికృత స్వ‌రూపాన్ని ప‌సిగ‌ట్ట‌లేక‌పోయింది. చ‌నిపోయిన త‌న సోద‌రుడి కుమార్తెనే చెర‌బ‌ట్టాడ‌త‌ను. రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ వ‌చ్చాడు.

ఈ ఘాతుకాన్ని భ‌రించ‌లేక‌- రెండురోజుల కింద‌టే ఆ యువ‌తి ఆత్మ‌హ‌త్యకు ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు ఆమెను ర‌క్షించారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని దావ‌ణ‌గెరె జిల్లాలో చోటు చేసుకుంది. ఆ కిరాత‌క పెద‌నాన్న పేరు సీవీ ప్ర‌భాక‌ర్‌. ప్ర‌భుత్వ ఉద్యోగి. క‌ర్ణాట‌క విత్త‌న అభివృద్ధి సంస్థ‌లో ప‌నిచేస్తున్నాడు. బాధిత యువ‌తిని సంర‌క్షించిన పోలీసులు ఆరా తీయ‌గా.. ఆమె అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించింది.

పోలీసుల‌తో క‌లిసి ఆమె నేరుగా దావ‌ణ‌గెరె ఎస్పీ కార్యాల‌యంలో ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు అత‌ణ్ణి అరెస్టు చేయ‌డానికి వెళ్లగా.. అప్ప‌టికే ప‌రారీలో ఉన్నట్టు తేలింది. అత‌ని కోసం గాలిస్తున్నామ‌ని దావ‌ణ‌గెరె పోలీసులు వెల్ల‌డించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)