బ్రేకింగ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ సీఎం అభ్య‌ర్థిగా JD ల‌క్ష్మీనారాయ‌ణ‌..!

2019 ఎన్నికలలో అన్ని పార్టీలు గెలుపుకోసం, అధికారం అందుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చాలా గట్టిగానే చేస్తున్నారు. ఆంద్రప్రదేశ్ లో ప్రధానంగా ఇప్పుడు రెండు పార్టీలు మాత్రమె పోటీగా కనిపిస్తున్నాయి. టీడీపీ మరియు వైసిపీ. అయితే మద్యలో నేనున్నాను అంటూ జనసేన వచ్చింది. కాని జనసేన చివరికి ఎవరో ఒకరితో పొత్తుకు పోతుంది అని అందరికీ తెలిసిందే. అది ఎవరితో అనేది తెలియాలంతే. ఇదిలా ఉంటె మాస్టర్ ప్లాన్స్ వేసే బీజేపి అందులో భాగంగా జనసేనణు వాళ్ళ లో కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే పవన్ కూడా కొత్తగా టీడీపీ ని విమర్శించడం ఇవన్నీ చూస్తే, పవన్ కళ్యాణ్ బీజేపీ లైన్ లో కి వెళ్తున్నారని, వీరిద్దరూ కలసి ఏపీ లో బీజీపీ కి అధికారం వచ్చేలా చెయ్యాలని ప్లాన్ లో ఉన్నట్టు, ప‌వ‌న్ యూటర్న్ తీసుకున్నార‌ని బీజేపీతో పొత్తుకు లైన్ క్లియ‌ర్ చేసుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కేవలం ఒక్క పవన్ తో అధికారం అందుకోలేమని భావించిన బీజేపీ, మరొక పవర్ఫుల్ క్యాండిడేట్ ని రంగంలోకి దించాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఓ ప‌క్క ఆప‌రేష‌న్ ద్ర‌విడ అంటూనే మ‌రో ప‌క్క రాజ‌కీయంగా చంద్ర‌బాబు, జ‌గ‌న్ ల‌ను దెబ్బ‌తీసేందుకు బీజేపి ఇతన్ని రంగంలోకి దింపుతుంది.అతనెవరో కాదు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఈయ‌న తెలియ‌ని తెలుగు వారుండ‌రంటే అతిశ‌యోక్తి లేదు. సీబీఐ జేడీగా ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడు. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుతో ఆయ‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం గా మారారు. అయితే జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఎప్ప‌టినుంచో ప‌లు పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ముఖ్యంగా ల‌క్ష్మీనారాయ‌ణ కోసం బీజేపీ గ‌ట్టిగా ప‌ట్టు ప‌డుతోంది.

ల‌క్ష్మీనారాయ‌ణ‌కు యువ‌త‌లో ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవ‌డంతో పాటు, ప్ర‌త్యేక హోదాపై ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం కూడా ఉన్నందున ఖ‌చ్ఛితంగా బీజేపీ గెలుస్తుంద‌ని న‌మ్ముతున్నారు క‌మ‌ల నాథులు. మ‌రోవైపు ఏపీలో కుల‌రాజ‌కీయాలు చాలా ఎక్కువే కాబ‌ట్టి, జేడీని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకోవ‌డంతో ఓ బీసీ నాయ‌కుడికి ప‌గ్గాలు అప్ప‌గిస్తున్నందున బీసీ ఓట్లు సైతం బీజేపీకి ప‌డ‌తాయ‌ని భావిస్తున్నారు పార్టీ నేత‌లు. ఇదే ప్లాన్ తో వెళ్తే, రాబోయే ఎన్నికల్లో బీజేపి గెలవడం, ల‌క్ష్మీనారాయ‌ణ‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అనుకుంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు….
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)