(వీడియో) భార్య వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకొని పారిపోయింది.. దీంతో ఆమెను చెట్టుకు కట్టేసి బెల్ట్ తో చితక్కొట్టిన భర్త

ఎంతో మంది అక్కడే ఉన్నారు.. ఇంతలో ఆ మహిళ చేతులను చెట్టుకు కట్టేశారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెను చితకబాదుతూ ఉన్నాడు. చూస్తున్న వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు. ఇంతకూ ఆ దెబ్బలు తింటున్న మహిళ ఎవరో కాదు.. కొడుతున్న ఆ వ్యక్తి భార్యనే..! ఆమెను అంతగా కొట్టడానికి కారణం ఆమె తన లవర్ తో లేచిపోవడమే.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని బులందర్ షహర్ జిల్లా లోని ఓ గ్రామ పంచాయతిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకొని పారిపోయింది. దీంతో ఆమెను తిరిగి పట్టుకొని వచ్చి గ్రామంలో పంచాయతి పెట్టారు. ఆ పంచాయతిలో భార్యను బెల్ట్ తో కొట్టమని తీర్మానించారు. దీంతో ఆమె చేతులను చెట్టుకు కట్టేయించి భర్తతో ఇష్టం వచ్చినట్లు కొట్టించారు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పోలీసుల వద్దకు విషయం వెళ్ళింది. దీంతో ఆ పోలీసులు మహిళను తీసుకొని రాగా మొత్తం జరిగిన ఘటన చెప్పేసింది. పంచాయతి పెద్దలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆమె భర్తపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరిని పోలీసులు విచారించనున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)