వేలం పాటలో అమ్మాయిని 22 వేలకు కొనుక్కుని పెళ్లి చేసుకున్నాడు అయితే డబ్బుకట్టలేదని అమ్మాయిని తీసుకెళ్ళి..

ఇదేదో సంతలో జ‌రిగే వేలం అనుకుంటున్నారా? కాదు కాదు... సభ్యసమాజం సిగ్గుపడేలా సాక్షాత్తూ వధువునే వేలంలో విక్రయించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సంత‌లో వ‌స్తువుల‌ను కొనుగోలు చేసిన‌ట్లు చివ‌ర‌కు వ‌ధువును కొనుగోలు చేసిన ఘ‌ట‌న ఇప్పుడు అంద‌రిలో ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 

అయితే పెళ్లి చేసుకునేందుకుగాను వధువును వేలంలో రూ.22వేలకు కొనుగోలు చేసిన దారుణ ఘటన బాగ్‌పట్ జిల్లాలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సూరూర్ పూర్ గ్రామానికి చెందిన ఓ యువతి ఇటుకబట్టీలో పనిచేస్తోంది. అదే ఇటుకబట్టీలో కార్మికుడిగా పనిచేస్తున్న యువకుడు యువతిని వివాహం చేసుకోవాల‌ని అనుకున్నాడు. దానికి ఇటుక బట్టీల యజమానులు ఓ షరతు విధించారు. 

అదేంటంటే...యువతిని పెళ్లి చేసుకోవాలంటే వేలంలో వధువును కొనాలని కోరారు. దీనికి యువకుడు అంగీక‌రించ‌డంతో యువతికి వేలం పాట నిర్వహించారు. వేలంపాటలో వధువును రూ.22వేలకు యువకుడు కొని 17వేల రూపాయలు చెల్లించి, మిగ‌తా ఐదువేల రూపాయ‌లు పెళ్లి త‌ర్వాత చెల్లిస్తాన‌ని ఆమెను వివాహం చేసుకున్నాడు. 

వివాహం అనంతరం వరుడు మిగ‌తా ఐదువేలు చెల్లించక పోవడంతో యజమానులైన ముకేష్, మోనులు వధువును ఎత్తుకెళ్లారు. దీంతో ఆవేదనకు గురైన వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ విష‌యం తెలిసిన ప‌లువురు ఇటుక‌బ‌ట్టీల యాజ‌మానుల‌పై మండిప‌డుతున్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌టం సిగ్గుచేట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)