అసలు పంట నష్టం కింద 2, 3, 5, 10 రూపాయలు అంటూ రాయటానికి చేతులు ఎలా వచ్చాయిరా ? కనీసం విషం తాగి చద్దామన్న సరిపోవు కదా..

నష్టపరిహారం అంటే లక్షల్లో కాకున్నా..వేలల్లో ఉంటుంది. రూపాయిల్లో మాత్రం ఉండదు కదా.. అందులోనూ సింగిల్ డిజట్ లో అయితే అస్సలు ఉండదు. మన దేశంలోని ఓ బీమా కంపెనీ మాత్రం రైతులతో పరిహాసం ఆడింది. దెబ్బతిన్న పంటకి.. పరిహారం కింద రైతులకు ఐదు, పది రూపాయలు చెల్లించి.. వ్యవసాయంపై పరాచకాలు ఆడింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

వాతావరణం సహకరించక తమిళనాడులోని దిండిగల్, నాగపట్నం జిల్లాల్లో పంటలు పండలేదు. రైతులు నష్టపోయారు. నష్టం జరిగితే భారీగా పరిహారం అందిస్తామని మొదట నమ్మించిన బీమా కంపెనీలు.. రైతులకు ఇప్పుడు కేవలం రూ.10, రూ.5, రూ.4, రూ.2 చొప్పున నష్టపరిహారాన్ని విడుదల చేశాయి. ఈ మొత్తాన్ని దిండిగల్‌ కేంద్ర సహకార బ్యాంక్‌ రైతులకు చెక్కుల రూపంలో అందించింది. ఈ విషయంపై తమిళనాడు అసెంబ్లీ సైతం దద్దరిల్లింది.

మాజీ మంత్రి, డీఎంకే నేత కె.పిచండి ఈ చెక్కులను సభలో చూపించారు. కరుపసామి రూ.102 ప్రీమియం కట్టినప్పటికీ ఆయనకు రూ.10 మాత్రమే నష్టపరిహారంగా అందింది. తిరుమలైసామి అనే మరో రైతు రూ.50 ప్రీమియం కట్టగా, ఆయనకు కేవలం రూ.5 నష్టపరిహారం ఇచ్చారు. ఈ చెక్కుల్ని మార్చుకోవాలంటే బ్యాంకుకు వెళ్లి రూ.500తో ఖాతాను తెరవాలి. వచ్చిన పరిహారంతో రైతులకు కలిగే లాభం ఏంటని మండిపడ్డారు కె.పిచండి.

పొలిటికల్ హీట్ ఎలా ఉన్నా.. అసలు బీమా కంపెనీలకు 2, 3, 5, 10 రూపాయలు అంటూ రాయటానికి చేతులు ఎలా వచ్చాయని రైతులకి మద్దతుగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. బీమా కంపెనీ పరిహాసాలు ఇలా ఉన్నాయని కొందరు అంటే.. బీమా మాయకి రైతులు మరోసారి మోసపోయారు అంటూ మరికొందరు తిట్టిపోస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)