అన్నం విలువ తెలిసిన దంపతులు అందరికి అన్నం విలువ తెలియాలి అని 25 ఏళ్ళ నుండి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు

హోటల్స్ ఇప్పుడు వ్యాపార కేంద్రంగా మారిపోయాయి నచ్చితే తినడం నచ్చకపోతే పడేవేయడం. మాములుగ హోటల్స్ కి వెళ్ళితే ఏమి తిన్నావ్, ఎందుకు పడేసావ్ అని అడగని ఈరోజుల్లో ఒక హోటల్ మాత్రం దీనికి భినంగా ఉంది.అది ఏంటో చూద్దాం.
ఈ హోటల్ లో ఆలా కాదు ఎంత తినాలి అనిపిస్తుందో అంతే తినాలి ఆలా కాదు మేము తినేది తింటాం వీలు కాకపోతే పడేస్తాం అంటే తినాలిసిందే అని వత్తిడి తెస్తారు అప్పటికి తినకపోతే మీరు కచ్చితంగా ఫైన్ కట్టాలి.
అన్నం పరబ్రహ్మ స్వరూపామ్ అని అందరికి తెలుసు అలాంటి అన్నని ఇష్టారాజ్యముగా వృధా చేస్తుంటాం. కానీ అన్నం విలువ తెలిసిన దంపతులు అందరికి అన్నం విలువ తెలియాలి అని భావించారు. భోజనం వ్యాపార దృక్పథంతో అందించే ఈరోజుల్లో సామజిక మార్పు కోసం దాదాపు 25 ఏళ్ళు పని చేస్తున ఒక ఫుడ్ కోర్ట్ ఏంటో తెలుసుకుందాం.

వరంగల్ జిల్లా కేంద్రం లో 3 దశాబ్దాల క్రితం ఒక చిన్నగా ప్రారంభమైన ఈ హోటల్. జిల్లా వాసులకి సుపరిచితం. ఇక్కడ లభిస్తున్న భోజనమే కాదు అక్కడ ఉండే పరిసరాలు కూడా అందరికిఆహ్లాదం
లింగాల కేదారి ఫుడ్ కోర్ట్ గా ప్రారంభమైన హోటల్ ప్రస్థానం. ఇప్పుడు సంచలనాలకు సామాజిక మార్పులకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎందుకు అంటే ఒకరు ప్రతి రోజు వృధా చేసే అన్నం ఏడాది లో ఒక బియ్యం బస్తా అని అంటారు. కడుపు నిండా తినాలి లేదా ఆ భోజనం వేరే వాళ్ల కడుపు నింపేలా ఉండాలి అని అంటారు ఈ హోటల్ యాజమాన్యం.
3 దశాబ్దాల క్రితం హోటల్ రంగంలోకి అడుగుపెట్టిన లింగాల కేదారి దంపతులు నేటికీ వంటశాలలో బిజీగా కనిపిస్తారు. తమను ఆదరించిన వారికీ ఇంట్లో భోజనం ఎలా ఉంటుందో అలాగే చేసి వాళ్లే స్వయంగా వడ్డిస్తారు. అంతే కాదు ప్రతి రోజు కస్టమర్లకి వడ్డించే ఆహారమే వాళ్ళు తింటారు.
రూ.50కే మాంసాహారం భోజనం ఇస్తారు. కానీ ఫుడ్ కోర్ట్ లో భోజనం చేయాలి అంటే కొన్ని షరతులు వర్తిస్తాయి అని అంటారు. భోజనం వృధా చేస్తే మాత్రం కచ్చితంగా ఫైన్ వేస్తారు
ఫైన్ వసూల్ చేసే దాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అన్నం కానీ కూర కానీ ఏది వృధా చేసిన ఊరుకోరు .ఒకవేళ ఎవరన్నా వృధా చేస్తే ఎంత పెద్ద గొడవ జరిగిన సరే ఫైన్ వసూల్ చేసే దాకా ఊరుకోరు. భోజనం బాగుగాకపోతే చెప్పండి మేమె ఫైన్ కడతాం అని అంటారు. ఇప్పటి వరకు 300 మందికి ఫైన్లు వేసాం అన్ని లింగాల దంపతులు చెబుతున్నారు. పోలీసులు కూడా జరిమానా కట్టారు అని చెప్పారు. వచ్చిన డబ్బులు నీరు పేదలకి ఖర్చు చేస్తాం అని చెప్పారు.
ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే ఈ హోటల్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఫ్రీగా టీ అందించారు ఈ దంపతులు.
అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో రోజుకు రూ.10000 ఖర్చుతో ఉచిత భోజనం ఆడించారు ఈ లింగాల దంపతులు. నిరుపేదలకు, గ్రామాల నుంచి వచ్చిన వారికి భోజనం అందచేశారు.
గతంలో ఒక టీ కి ఇంకో టీ ఫ్రీ ,ఒక టిఫిన్ కి ఇంకో టిఫిన్ ఫ్రీ , ఒక భోజనానికి ఇంకో భోజనం ఫ్రీ అంటూ ఆఫర్స్ ఇచ్చారు. అలాగే మిగతా హోటల్స్ కంటే సగం ధరలకే నాణ్యమైన భోజనం అందించారు. మొత్తానికి భోజన వృధా చేయకూడదు అని వీరు చేస్తున ప్రయత్నం అందరి ప్రసంశలు పొందుతోంది. ఇంకా పూర్తివివరాలకు ఈ వీడియో చూడండి.

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)