మరుగుదొడ్డి నీళ్లతో షర్బత్ తయారు

Loading...
మండుతున్న ఎండలతో రోడ్డు పక్కన బండిపై విక్రయించే షర్బత్ కనిపిస్తే చాలు…అది తాగి కాస్తంత ఎండ నుంచి ఉపశమనం లభిస్తుందనుకుంటాం… కానీ ఉపశమనం మాటేమో గాని షర్బత్ తయారీకి వినియోగించిన నీళ్ల గురించి తెలిస్తే వాంతి చేసుకోవాల్సిందే.

tగుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని కాలూపూర్ లోని పంచకువ ప్రాంతంలోని ఓ సామూహిక మరుగుదొడ్డి ఎదుట నాలుగు చక్రాల షర్బత్ బండి ఆపిన ఓ యువకుడు.. మరుగుదొడ్డి పైపు సాయంతో డ్రమ్ములో నీటిని నింపుతున్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరుగుదొడ్డి నీళ్లతో షర్బత్ తయారు చేసి విక్రయిస్తున్న వ్యవహారాన్ని అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు తీవ్రంగా పరిగణించారు. అలాంటి వారిపై చర్యలకు ఉపక్రమించారు.

పే అండ్ యూజ్ మరుగుదొడ్డి నిర్వహిస్తున్న కాంట్రాక్టరుకు నోటీసులు జారీ చేశామన్నారు అహ్మదాబాద్ మున్సిపల్ వైద్యాధికారి భావిన్ సోలంకి. మరుగుదొడ్డి నీళ్లను షర్బత్ తయారీకి నింపుకున్న వ్యాపారి ఎవరనే విషయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు. భవిష్యత్ లో ఇలా షర్బత్ వ్యాపారులు మరుగుదొడ్డి నీళ్లు వినియోగించకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు మున్సిపల్ అధికారులు.
Loading...

Popular Posts