నగ్న ఫొటోలతో ఓ ఆంటీని వేధించి.. ఆమె ఆత్మహత్యకి పాల్పడేలా చేసిన 10th క్లాసు స్టూడెంట్స్

నగ్న ఫొటోలతో ఓ గృహిణిని వేధించి.. ఆమె ఆత్మహత్యకి పాల్పడేలా చేసిన నలుగురు యువకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాకి చెందిన మహిళ.. తన భర్త ఉద్యోగ నిమిత్తం ఒడిశాలో ఉంటుండటంతో ముగ్గురు పిల్లలతో కలిసి చండిపూర్‌లో ఉంటోంది. రెండు నెలల క్రితం తన కూతురు డ్యాన్స్ స్కూల్ వద్ద గృహిణి తన మొబైల్ ఫోన్‌ని పోగొట్టుకుంది. అయితే.. ఆ ఫోన్ పదో తరగతి చదువుతున్న స్కూల్ విద్యార్థికి దొరకగా.. దాన్ని తిరిగి గృహిణికి ఇచ్చేశాడు. కానీ.. ఫోన్ తిరిగిచ్చే సమయంలోనే అందులో ఉన్న గృహిణికి సంబంధించిన కొన్ని అభ్యంతరకర ఫొటోల్ని తన మొబైల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు.

గృహిణి వ్యక్తిగత ఫొటోల్ని ఆ స్కూల్ విద్యార్థి తన సహచర విద్యార్థులకి చూపించగా.. వారు స్థానిక యువకుడికి చూపించారు. దీంతో.. నలుగురూ కలిసి గృహిణిని వేధించడం మొదలెట్టారు. ఈ ఫొటోల్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయకుండా ఉండాలంటే.. తమతో శారీరక సంబంధం పెట్టుకోవాలని, నగ్న ఫొటోల్ని పంపించాలని డిమాండ్ చేశారు. దీనికి గృహిణి నిరాకరించడంతో.. ఇటీవల వారి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో.. తీవ్రంగా కలత చెందిన ఆమె.. సూసైడ్ నోట్ రాసి గత శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది.

‘నా సోదరిని నగ్న ఫొటోలు పంపాల్సిందిగా ఫోన్‌లో విద్యార్థులు డిమాండ్ చేశారు. లేకపోతే.. సోషల్ మీడియాలో ఫొటోల్ని అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. దీంతో.. పరువు పోవడం కంటే.. ప్రాణం తీసుకోవడమే మేలని ఆమె ఆత్మహత్య చేసుకుంది’ అని గృహిణి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం నిందితుల్ని అరెస్టు చేసినట్లు తూర్పు మిడ్నాపూర్ ఎస్పీ వి. సోలోమాన్ వెల్లడించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)