డైటింగ్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా పొట్ట తగ్గకపోవడానికి కారణాలు..

Loading...
  • ప్రతిరోజు రన్నింగ్ చేయడం వంటి అధిక శారీరక శ్రమ కలిగిన వ్యాయామాలు చేయడం గెండెకు మంచిదే కాని బరువు విషయంలో మాత్రం అదొక్కటే సరిపోదు. కండరాలపై ఒత్తిడి పెంచె పలు రకాలు ఎక్సర్‌సైజ్‌లను పాటించాల్సి ఉంటుంది. కండరాలు కొవ్వు కన్నా ఎక్కువ కాలరీలను కరిగిస్తాయి. కాబట్టి ఎక్కువ మజిల్ కలిగి ఉంటే రోజు మొత్తం మీదు ఎక్కువ కాలరీలు ఖర్చవుతాయి. బెల్లీ కడుపును వదిలించుకోవాలంటే వ్యాయామాల విషయంలో కొంచెం ఎక్కువగానే శ్రమ పడాల్సి ఉంటుంది. తక్కువ శ్రమ కలిగిన ఎక్సర్‌సైజ్‌ల వల్ల అంత మార్పులేమీ ఉండవు. అంటే చేయగలిగినంత సేపు వ్యాయామాలు చేయడం అది కూడా కొవ్వు ఉన్న ప్రాంతాల్లో ఒత్తిడి కలగజేసే వ్యాయామాలు చేయడం సరైన మార్గం. 
  • శుద్ధి చేయబడ్డ ధాన్యాలు, షుగర్స్, తీయగా ఉండే డ్రింక్స్, చిప్స్, స్పైసీ ఫుడ్ వంటవి తినడం మంచిది కాదు. కడుపులో మంట కలిగించే ఆహారపదార్ధాల వల్ల కుడుపులో కొవ్వు కరగదు. సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఆమ్ల గుణం లేని ధాన్యాలు, కారం, స్పైసీలేని ఫుడ్ తీసుకోవడం వల్ల కొవ్వు బాగా కరుగుతుంది. 
  • శరీరం అన్ని రకాలు కొవ్వు పదార్దాలకు ఒకే విధంగా స్పందించదు. మాంసం, పాలు వంటివాటి వల్ల పొత్తికడుపు కొవ్వు బాగా పెరుగుతుంది. ఆలీవ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ విత్తనాలు, వాల్‌నట్స్, కొవ్వు చేపల వాడకం మంచిది. కొవ్వుకారక ఆహారపదార్ధాలను అమితంగా తినడం ఎప్పటికైనా ప్రమాదకరమే.
Loading...

Popular Posts