మట్టి కుండలోని నీరు తాగితే చాలా రోగాలకు దూరంగా ఉండచ్చు

Loading...
మట్టి కుండలోని నీటితో చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు నిపుణులు. ఫ్రిడ్జ్ వాడటం వల్ల మనకే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో ముప్పు పొంచి ఉంది. ఫ్రిడ్జ్ నుంచి ఉత్పత్తయ్యే హానికారక వాయువులు నేరుగా ఓజోన్ పొరపై ప్రభావం చూపుతున్నాయి. ఇక ఫ్రిడ్జ్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు పేలడంతో పాటుగా అనారోగ్య సమస్యలూ కొని తెచ్చుకున్నట్టవుతుందని నిపుణులు చెప్తున్నారు. కరెంట్ బిల్ సంగతి పక్కనపెడితే ఫ్రిడ్జ్ వాటర్ తో గొంతు సంబంధిత వ్యాధులు, అలర్జీ, సైనస్ లాంటి సమస్యలు తలెత్తే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కుండలోని నీటితో ఇలాంటి సమస్యలుండవన్నది నిపుణుల మాట. మట్టి కుండలోని నీటితో శరీరానికి సమతూకమైన చల్లదనం అందడంతో పాటుగా చెమటద్వారా కోల్పోయిన లవణాలు ఈ నీటి ద్వారా లబించి కిడ్ని, మెదడు చురుగ్గా పని చేస్తాయని నిపుణులు అంటున్నారు.
Loading...

Popular Posts